Take a fresh look at your lifestyle.

ఆ దంపతులు ఆధర్శం – ఊళ్లో ఆడపిల్ల పుడితే రూ. 2వేలు

0 19

ఆ దంపతులు ఆధర్శం
– ఊళ్లో ఆడపిల్ల పుడితే రూ. 2వేలు

(వయ్యామ్మెస్ ఉదయశ్రీ)
ఒకప్పుడు ఆడ పిల్ల పుడితే ఇంటికి లక్ష్మీ వచ్చిందని భావించేవారు.. కుటుంభీకులంతా కలిసి సంతోషపడేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆడపిల్ల పుట్టింది అనగానే విసుక్కునే వారే ఎక్కువ. మరి కొందరైతే ఆ పసికందును చెత్త బుట్టలోనో.. స్మశాన వాటికలో వదిలి పెడుతున్న సంఘటనలు కోకొల్లాలు.. సీక్రెట్ గా లింగనిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఆ పరీక్షలలో ఆడపిల్ల అని తేలితే కడుపులోనే హత్య చేస్తున్నారు.

కానీ.. నిజామాబాద్‌ జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియల్‌ గ్రామంలో రెడ్డిగారి తిరుపతిరెడ్డి – శ్రావణలక్ష్మి దంపతులు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు ఫిదా అవుతున్నారు. 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సమాజానికి ఉపయోగ పడే పని చేయాలని ఆ దంపతులు నిర్ణయించారు. అంతే.. ఆడపిల్ల పుడితే అసహించుకునే ఈ సమాజంలో మనం వారికి చేయూతలా నిలుద్దాం అని నిర్ణయించుకున్నారు. 1 జనవరి, 2024 నుంచి సొంత ఊళ్లో పుట్టిన ఆడపిల్లకు రెండు వేల రూపాయల డిపాజిట్ చేయాలని తీసుకున్న ఆ నిర్ణయం పట్ల పలువురు ఆ దంపతులను అభినందిస్తున్నారు.

సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో..

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి ఆ ఆడపిల్ల పేరుతో 2 వేల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు ఆ దంపతులు తిరుపతిరెడ్డి – శ్రావణలక్ష్మి. తమ నిర్ణయం అందరికీ తెలిసేలా ప్రచారం కూడా చేస్తున్నారు. పాంప్లేట్లు వేయించారు. ఆడపిల్ల పుట్టినవారు తమను సంప్రదించాలని కోరుతున్నారు. ఏండ్రియల్‌ గ్రామం లో పుట్టిన ప్రతి ఆడపిల్లకు తమ తరపున సుకన్య సమృద్ధి ఖాతా తెరిచి 2వేల రూపాయలు జమ చేస్తామని చెప్తున్నారు ఆ దంపతులు.
ఆడపిల్ల చదువు, పెళ్లికి..

ఆడపిల్ల ఉన్నత చదువులకు, వారి పెళ్లికి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, పుట్టినప్పటి నుంచే తల్లిదండ్రులు పొదుపు చేయాలనే అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు ఆ దంపతులు. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు.. మా ఇంటికి వస్తే ఏమి తెస్తావ్ అనే స్వార్థంతో బతుకుతున్న నేటి కాలంలో తిరుపతిరెడ్డి – శ్రావణలక్ష్మిల నిర్ణయంకు ‘నిర్దేశం’ సెల్యూట్ చెబుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking