Take a fresh look at your lifestyle.

హరీష్ రావు బలుపు మాటలు

0 17

హరీష్ రావు బలుపు మాటలు

హరీష్ రావు.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పేరుతో తెరపైకి వచ్చారు. మామ కేసీఆర్ కు రథ సారధిలా ఉంటూ టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వ్యహాత్మకంగా వ్యవహరిస్తారనే టాక్. కానీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీలో ఆర్థికంగా బాగు పడిన వారిలో హరీష్ రావు మూడో వ్యక్తిగా నిలుస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ ఎస్ ఓడి పోయి ప్రతిపక్షానికి పరిమితం కావడంతో కేసీఆర్ ఫ్యామిలీ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ల మాటలు అహంకారంతో ఉంటున్నాయనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇగో.. హరీష్ రావు ను ఉద్దేశించి ఓ ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ‘సగటు ఉద్యోగి అభిప్రాయం’ అంటూ పెట్టిన పోస్ట్ ఇదే..

హరీష్ రావు బలుపు మాటలు

– వేతన జీవులను AC రూమ్ లలో కూర్చొని జీతాలు తీసుకుంటారు అని అనడం వారి విజ్ఞతకే వదిలేద్దాం.
– ⁠90 శాతం మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు కనీసం ఫ్యాన్ కూడా ఉండదు.
– ⁠నెల నెల పనిచేసి తీసుకునే వేతనంకు సంక్షేమ పథకాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబో హరీష్ రావు గారికే తెలియాలి.
– ఉద్యోగులు అంటే తమలాగా కూలిపోయే ప్రాజెక్టులు (కాళేశ్వరం) కట్టే వాళ్ళు అనుకుంటున్నాడెమో ?
– ⁠ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళేదే ఉద్యోగులు, ఉపాధ్యాయులు.
– ⁠రాక్షస రాజకీయం అంటే ఇదేనేమో ఓట్ల కోసం ఒక్కరిని నిందించి లబ్ది పొందాలనుకోవడం దుర్మార్గం.
– తెలంగాణ పేరు చెప్పుకొని వేల కోట్లు దండుకొని మీరు (హరీష్ రావు)ఇవ్వాళ ఈ విధంగా మాట్లాడం దారుణం.
– ⁠తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో పాల్గొని పోరాటాలు జరిపి తెలంగాణ తెచ్చింది ఈ రాబందుల కోసమా అనిపిస్తుంది.
– గత ఐదు సంవత్సరాల నుండి మేము జమ చేసుకున్న ZPGPF, TSGLI వాడుకున్న దొంగలు ఇవ్వాళ మా మీద పడి ఏడుస్తున్నారు.
– DAలు , PRC అరియర్స్, సప్లీమెంటరీ బిల్స్ ఇలా అన్ని పెండింగులో పెట్టి ఈ రోజు ఓట్ల కోసం హరీష్ రావు బరితెగించి మాట్లాడుతున్నాడు
– ఒక్కసారి రాష్ట్ర బాధ్యులు హరీష్ రావు గారి దగ్గరికి ⁠పెండింగ్ బిల్స్ కోసం వెళ్ళినప్పుడు అయన వ్యవహారశైలి చాలా దారుణంగా వుండే…
– హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా కూలిపోయే ప్రాజెక్టులు కడితే అది రైతులకు అన్యాయం చేసినట్టు కాదు మాకు జీతాలు ఇస్తే రైతులకు అన్యాయం చేసినట్టు, ఇది ఎక్కడి విడ్డురమో?
– ⁠ఏది ఏమైనా దేవుడు ఉన్నాడు అందుకే ఓడిపోయారు. కనీసం ఎంపీ అభ్యర్థులను నిలబెట్టుకుందాం అంటే Candiate లు లేరు ఇది ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఆయిన చింత చచ్చిన పులుపు చావలేదు..
– ఇంకా అదే అహంభావం …అదే అహంకారం… అదే దొరతనం.. ఇంకా అగ్గిపెట్టె నాటకాలు బంజేసి మారితే భవిష్యత్తు లో నైనా అవకాశం వుంటది. లేకపోతే మీ పార్టీ మీరు భూ స్తాపితమే…

ఇట్లు
మీ పాలన లో వంచనకు, నిర్లక్ష్యానికి గురైన సగటు ఉద్యోగి
(పేరు రాయని ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఇది)

Leave A Reply

Your email address will not be published.

Breaking