Take a fresh look at your lifestyle.

బీసీ, బడుగు వర్గాలకు రాజ్యాధికారం టీడీపీకే సాధ్యం

0 168

బీసీ, బడుగు వర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే..తెలుగుదేశం మరలా అధికారంలోకి రావాలి *
* ఎన్టీఆర్ వచ్చాకే తెలంగాణలో బిసిలకు, పేదలకు సామాజిక, రాజకీయ న్యాయం *
* చంద్రబాబు ఐటీ ఆర్థికాభివృద్ధి ఫలాలతోనే నేటి ప్రభుత్వం మనుగడ సాధిస్తుంది *
* నేటి పాలకులు స్వార్ధ ప్రయోజనాల కోసం పన్నుల భారంతో ప్రజలను గోస పెడుతున్నారు *
* ప్రజలంతా తెలుగుదేశం ను గెలిపించుకునేందుకు ఒక్కటై ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది *
* తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ *
* టిడిపిలో చేరిన దేవర కద్ర కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు *

హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే తెలంగాణ రాష్ట్రం లో మరలా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు.

తెలంగాణలో ఈ వర్గాలకు ఎన్టీఆర్ వచ్చాకే సామజిక, రాజకీయ న్యాయం జరిగిందని చెప్పారు. గురువారం తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో.. మహబూబ్ నగర్ జిల్లా దేవర కద్ర నియోజకవర్గానికి చెందిన వివిధ కులాల సంఘాల, వివిధ పార్టీల నాయకులు టిడిపిలో చేరారు. వీరికి తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పటేల్, పట్వారీ, భూస్వామ్య కబంధ హస్థలలో నలిగిపోతున్న తెలంగాణ ప్రజలకు 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఊపిరిని ఇచ్చిందన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, మండలాల ఏర్పాటు, రెండు రూపాయలకు కిలో బియ్యం, హార్స్ పవర్ కరెంటు సప్లయ్, మహిళలకు ఆస్తి హక్కు, వంటి విప్లవాత్మక నిర్ణయాలతో తెలుగుదేశం ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించి ఆ వర్గాలను ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం చేసిన ఘనత కూడా ఎన్టీఆర్, చంద్రబాబుకే దక్కిందన్నారు.

కాసాని జ్ఞానేశ్వర్ సమక్షంలో టిడిపిలో

చేరిన దేవరకద్ర నియోజకవర్గ కుల సంఘాల నాయకులు

టిడిపి మహబూబ్ నగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మెట్టు కాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవర కద్ర అసెంబ్లీ నియోజకవర్గంకు చెందిన డి.జనార్ధన్ నాయుడు, డి.రవి కుమార్, టి.కృష్ణయ్య, వి.రవి, శ్యా మ్సన్, బాలస్వామి, పురుషోత్తం, నవీన్ నాయకత్వంలో వివిధ బిసి కులాలకు, పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking