Take a fresh look at your lifestyle.

ఒకరిని హత్య చేసారు.. ఇన్ స్టాగ్రాం లో రీల్ పెట్టారు..

0 13

ఒకరిని హత్య చేసారు..
ఇన్ స్టాగ్రాం లో రీల్ పెట్టారు..
నిర్దేశం, హైదరాబాద్ :
సోషల్ మీడియా యువత జీవితాలను నాశనం చేస్తోంది. నియంత్రణ లేని పోస్టులతో యువతపై చెడు ప్రభావం పడుతుంది. రీల్ పేరిట తీస్తున్న పోస్ట్ లు కొందరికి భవిష్యత్ లేకుండా పోతుంది. కాలేజ్ కు వెళ్లి బుద్ది మంతుడిలా చదువు కోవాల్సిన ఇద్దరు యువకులు మానవ మృగాలుగా మారారు. సిద్ధు అనే యువకుడిని దారుణంగా హత్య చేసి ఇన్ స్టాగ్రాంలో రీల్ పోస్ట్ చేసిన సంఘటన హైదరాబాద్ నగరం బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
సిద్ధు బైక్ పై వెళుతుండగా సినీమా ఫక్కిలో వెంబడించిన ఇద్దరు యువకులు పన్నెండు సార్లు కత్తితో పొడిచారు. అప్పటికి ఇంకా బ్రతికి ఉంటాడని భావించిన ఆ ఇద్దరు యువకులు బండరాళ్లతో తలపై మోది కౄరంగా హత్య చేసారు. అయితే.. ఆ సిద్ధును హత్య చేసిన అనంతరం రక్తంతో ఉన్న కత్తులను, చేతులను చూయిస్తూ సెల్ఫీ వీడియో రీల్ తీసుకుని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఆ యువకులు..
గతంలో తమ స్నేహితుడు తరుణ్ రాయ్ ను సిద్ధు హత్య చేసారని భావించిన ఆ యువకులు కక్ష పెంచుకుని దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో విచక్షణ రహితంగా హత్య చేసి తమ జీవితాలను యువత నాశనం చేసుకుంటున్నారని వారు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking