Take a fresh look at your lifestyle.

నోరు జారితే అంతే

0 20
  • కేసీఆర్ వ్యాఖ్యలతో మూడు ఎంపీ స్థానాలు కోల్పోయిన బీఆర్ఎస్
  • డీఎస్ కు సీఎం పదవి మిస్
  • నోరు అదుపులో పెట్టుకోవాలని కేటీఆర్ కు పంచాంగ కర్త సూచన

నిర్దేశం, హైదరాబాద్: సోషల్ మీడియా విస్తరించిన ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఏమి మాట్లాడినా విస్తృతంగా వైరల్ అవుతుంది. నాయకుల కదలికలపై, మాటలపై సోషల్ మీడియా నిఘా పెడుతుంది. అందుకే ఎక్కడ మాట్లాడినా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. చివరికి అనుచరులతో ఫోన్ మాట్లాడాల్సి వచ్చినా జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు జారితే భారీ మూల్యం చెల్లించాల్సిందే. గతంలో నేతలు నోరు జారడంతో ప్రత్యర్థులకు మేలు జరిగిన సందర్భాలున్నాయి. క్రోధి నామ ఉగాది సందర్భంగా తెలంగాణ భవన్ లో పంచాంగ పఠనం నిర్వహించారు.

ఈ సందర్భంగా పంచాంగ కర్త ప్రణీత్ కేటీఆర్ నుద్దేశించి నోటిమాటతో కొన్ని ఇబ్బందులు వస్తాయని, మృదువుగా, ఆచి తూచి, మాట్లాడాలని, మాట కట్టడి చేయాలని సూచించారు. మకర రాశి ఆధారంగా చెప్పారో, కేటీఆర్ ఇటీవల మాట్లాడిన దానిని దృష్టిలో పెట్టుకుని పంచాంగ కర్త సూచన చేశారో తెలియదు గాని నాయకులు నోరు జారడంతో మూల్యం చెల్లించిన సందర్భాలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమయ్యాయి. కేటీఆర్ ఒక సందర్భలో జైశ్రీరాం అన్నం పెట్టదు, ఉద్యోగాలివ్వదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య వల్ల పార్టీ బాగా నష్టపోయింది. ఆ విషయం తెలిసి కూడా సున్నితమైన అంశం గురించి కేటీఆర్ మాట్లాడారు.

Astrologer warn to KTR

గతంలో మూడు నియోజకవర్గాలలో ప్రభావం

గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య మూడు పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రభావితం చేసింది. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కరీంనగర్ సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. హిందువులు బొందుగాళ్లు అనే వ్యాఖ్య వైరల్ అయింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాలలో వైరల్ అయి ఈ మూడు సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. నిజామాబాద్ లో కేసీఆర్ కూతురు కవిత కూడా ఓడిపోయింది. ఈ మూడు చోట్ల బీజేపీ గెలుపొందింది. పార్లమెంట్ ఎన్నికలకు నాలుగు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుపొంది ఎంపీ స్థానాలు కోల్పోవడం గమనార్హం.

సీఎం పదవి మిస్ అయిన డీఎస్

పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ నోరు జారి రాజకీయాల్లో మంచి అవకాశం కోల్పోయారు. 2009 ఎన్నికల సభలో ఒక వర్గం వారి వైపు ఎవరైనా చేతెత్తితే నరికేస్తానన్నారు. అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం అంతగా లేదు. పేపర్ కటింగ్ జిరాక్స్ తీసి ఇంటింటికి పంపిణీ చేశారు. దీంతో డీ శ్రీనివాస్ ఓటమి చెందారు. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే వైఎస్ రాజ శేఖర్ రెడ్డి మరణాంతరం ముఖ్యమంత్రి పదవి డీఎస్ కు వరించేది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయారు. మళ్లీ కాంగ్రెస్ లో ఏ పదవీ రాలేదు. నోరు జారితే పరిణామాలు ఎలా ఉంటాయో కేసీఆర్, డీఎస్ కు అనుభవమైంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking