Take a fresh look at your lifestyle.

చంద్రబాబు సభలో తొక్కిసలాటలో ఎనిమిది గురు మృతి

0 71

 

చంద్రబాబు కందుకూరు సభలో అపశృతి..

తొక్కిసలాటలో ఎనిమిది గురు మృతి

నెల్లూరు : నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకుంది.

సభా ప్రాంగణానికి దగ్గరలో మురికి కాలువ ఉండగా సభకు హాజరయ్యే క్రమంలో తొక్కిసలాట జరిగిందని సమాచారం. పలువురు కాలువలో పడిపోయగా.. ఈ ఘటనలో ఎనిమిది గురు మృతి చెందారు.

తొక్కిసలాటలో పలువురు గాయపడగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

పార్టీ తరపున మృతుల కుటుంబాలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. మృతుల పిల్లలను ఎన్టీఆర్‌ ట్రస్టు విద్యాసంస్థల్లో చదివిస్తామని హామీ ఇచ్చారు. తోపులాట నేపథ్యంలో సభను రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking