Take a fresh look at your lifestyle.

కోట శ్రీనివాస్ రావు క్షేమంగా ఉన్నారు..

0 343

అయ్యా..  నేను బతికే ఉన్నాను..

: సినీ ఆర్టిస్ట్  కోట శ్రీనివాస్ రావు

హైదరాబాద్, మార్చి 21 : మీడియా అనుకుంటే ఏమైనా చేయచ్చు.. బతికినోణ్ణి చచ్చాడని వార్త ఇవ్వొచ్చు.. ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే తుది శ్వాష వదిలాడాని టీవీలో స్క్రోలింగ్ చెప్పొచ్చు. వృద్దాప్యంలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంటే మరణించాడని వార్త కథనాలు ఇవ్వొచ్చు.. సోషల్ మీడియా మరో అడుగు ముందుకు వేసి వార్త కథనాలు ఇస్తోంది. 

ఔను.. మీరు చదివింది నిజమే.. తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టిన ప్రముఖ సినీ ఆర్టిస్ట్  కోట శ్రీనివాస్ రావు మరణించారని వార్త కథనాలు ఇచ్చింది మీడియా.. 

‘‘అయ్యా..  నేను బతికే ఉన్నాను..’’ అంటూ సెల్ పోన్ తో వీడియో తీసి మీడియాకు పంపించారు సినీ ఆర్టిస్ట్  కోట శ్రీనివాస్ రావు. ఆ వీడియో ఇప్పుడు సోషల్  మీడియాలో వైరల్ అవుతుంది. ‘‘ఉగాది పండుగ శుభకాంక్షలు..’’ చేతులు జోడించి ఆ వీడియోలో చెప్పారు కోట..  

ఆ వీడియో మీరు వినండి.. 

Leave A Reply

Your email address will not be published.

Breaking