Take a fresh look at your lifestyle.

క్షమాభిక్ష ప్రకటించిన మలేషియా అక్రమంగా ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్

0 21

మలేషియాలో అక్రమంగా ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్

(బురెడ్డి మోహన్ రెడ్డి మలేషియా నుంచి)

బ్రతుకు తెరువు కోసం మలేషియా వెళ్లిన విదేశీయులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీసా లేకుండా చట్టవిరుద్దంగా పనులు చేసుకుంటూ మలేషియాలో చాలా మంది ఉంటున్నారు. అలా ఉన్న వాళ్లను కల్లివిల్లిలో పని చేసుకోవడం అంటారు. అయితే.. ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో మలేషియాలో ఉంటున్న ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్ ఇతర విదేశాలకు చెందిన వారికి  మలేషియా క్షమాభిక్ష పథకం మైగ్రాన్ట్ రిపాట్రియాషన్ ప్రోగ్రాం (ఆర్పీఎం)  ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

 

ఉపాధి కోసం మలేషియా వచ్చి వీసా లేకుండా ఉండే వారిని పోలీసులు పట్టుకుని జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా వేస్తారు. బ్రతుకు తెరువు కోసం మలేషియా వచ్చిన వారు డబ్బులు సంపాదించుకొవాలని తప్పని సరి పరిస్థితులలో ఏళ్ల తరబడి కల్లివిల్లిలో పనులు చేసుకుంటూ ఉంటున్నారు.

అయితే.. మలేషియా ప్రభుత్వం  మైగ్రాన్ట్ రిపాట్రియాషన్ ప్రోగ్రాం (ఆర్పీఎం) ఆమ్నెస్టీ క్షమాభిక్ష ప్రకటించింది . ఈ పథకం మార్చ్ 1 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు సైదం తిరుపతి, ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి తెలిపారు.  పాస్ పోర్ట్ లేకుండా మలేషియాలో ఉన్నోళ్లు.. వర్క్ పర్మిట్ (వీసా) గడువు ముగిసిన వారు మలేషియా వదిలి వెళ్ళి పోవడానికి అవకాశం ఉంటుందన్నారు వారు.

మలేషియా ప్రభుత్వం ప్రకటించిన మైగ్రాన్ట్ రిపాట్రియాషన్ ప్రోగ్రాం అవకాశం వల్ల ఆమ్నెస్టీకి 500 రింగ్గిట్ మలేషియా కరెన్సీ ( ఇండియా కరెన్సీ పది వేలు) చెల్లించాల్సి ఉంటుందన్నారు వారు. అలాగే పాస్ పోర్టు లేని వారు ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ మరియు సొంతంగా రెండు వారాల్లో ఇండియా  వెళ్లే విధంగా ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని వారు వివరించారు.   

మలేషియా లో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ , నిజామాబాదు, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు సంబంధించిన కార్మికులు సరైన అవగాహన లేకుండా ఏజెంట్ల చేతులలో మోసపోయి మలేషియా జైల్లో మగ్గుతున్న కార్మికులకు కూడా ఈ మైగ్రాన్ట్ రిపాట్రియాషన్ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

అరుదుగా వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని తమ స్వదేశాలకు వెళ్లాలని కోరారు వారు. అక్రమంగా మలేషియాలో ఏళ్ల తరబడి ఉంటున్న ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ వాసులకు విమాన టికెట్, అపరాద రుసుం ప్రభుత్వాలు భరించాలని వారు కోరారు. మలేషియాలో ఇతరాత్ర సహాయం కోసం మలేషియా తెలంగాణ అసోసియేషన్  ను సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు.

బురెడ్డి మోహన్ రెడ్డి

 

Leave A Reply

Your email address will not be published.

Breaking