Take a fresh look at your lifestyle.

నర్సింహులుకు ‘సాక్షి’ ఎక్స్ లెన్స్ అవార్డు

0 35

నర్సింహులుకు ‘సాక్షి’ ఎక్స్ లెన్స్ అవార్డు

నిర్దేశం, భువనగిరి :
భువనగిరి జిల్లా సాక్షి దినపత్రిక సీనియర్ జర్నలిస్ట్ యంబ నర్సింహులుకు ‘సాక్షి’ ఎక్స్ లెన్స్ అవార్డు లభించింది. సాక్షి దినపత్రికలో 2023 నాలుగో త్రైమాసికంలో ఉత్తమ కథనాలు రాసినందుకు ఈ అవార్డును యజమాన్యం ప్రకటించింది.

 

నర్సింహులు గురించి..
యంబ నర్సింహులు.. సమాజంలో జరిగే అన్యాయాలకు అక్షర రూపం ఇస్తాడు. వార్త కథనాలుగా పేల్చి సమస్యలను పరిష్కరిస్తాడు.. ప్రజల కోసం జర్నలిజం అని నిక్కచ్చిగా ఉంటాడు అతను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన నర్సింహులు 1993లో ‘ఉదయం’ రాజాంపేట్ మండల స్ట్రింగర్ గా జర్నలిజం వృత్తిలోకి వచ్చారు. ఆ తరువాత 1996లో ‘వార్త’ ప్రారంభంతోనే ఆలేరు ప్రాంతానికి రిపోర్టర్ గా మారాడు. అక్కడే సుదీర్ఘ కాలం జర్నలిస్టుగా పని చేశారు.

స్టాఫ్ రిపోర్టర్ గా..
2006లో జనగామ డివిజన్ ‘వార్త’ స్టాఫ్ రిపోర్టర్ గా పని చేశారు. 2016లో యాదాద్రి భువనగిరి జిల్లా ‘సాక్షి’ స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత నర్సింహులు రాస్తున్న వార్త కథనాలతో 2023లో సీనియర్ జర్నలిస్ట్ గా ప్రమోషన్ ఇచ్చింది ‘సాక్షి’ దిన పత్రిక యజమాన్యం.
రెండు ప్రాణాలను రక్షించి..
ఆలేరు ప్రాంతంలోని తూర్పు గూడెంలో మంత్రగాడు అనే నెపంతో గ్రామస్థులు భార్య భర్తలను చెట్టుకు కట్టేసి కొడుతుంటే వార్త రాసి ఇద్దరు ప్రాణాలను రక్షించడం జర్నలిజం వృత్తిలో మరిచి పోలేని సంఘటనగా చెబుతారు నర్సింహులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking