Take a fresh look at your lifestyle.

ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన మల్లన్నకు విప్లవ జోహార్లు..

0 18

కామ్రేడ్ మల్లన్న మీకు విప్లవ జోహార్లు..

కిసాన్ నగర్ మల్లన్న.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో ఈ పేరు తెలియని వారు అరుదు. జీవిత కాలమంతా అతను పేదల కోసం పని చేసిన పోరాట వీరుడు. సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథాతో అడుగులు వేసిన మల్లన్న బాల్యం నుంచి లెఫ్ట్ ఐడియాలాజీతో పెరిగారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో జాబ్ చేస్తునే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజాపంథా వారికి సహాయం చేసేవారు. బాల్కొండ ప్రాంతంలో ప్రజాపంథా ప్రొగ్రాంలు ఉంటే మల్లన్న ఇల్లే అడ్డా.. అక్కడే బోజనాలు.. అక్కడి నుంచే కార్యకలపాలు. కమ్యూనిష్టు సిద్దంతాలపై శిక్షణ తరగతులు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ప్రాంతంలో నిర్వహించడానికి మల్లన్న అన్నీ చూసుకుంటాడనే నమ్మకం. ప్రజాపంథా నాయకులపై పీపుల్స్ వార్ గ్రూప్ నక్సల్స్ దాడులు చేస్తున్న తరుణంలో  కమ్యూనిష్టులకు ఆశ్రయం కల్పించిన యోధుడు మల్లన్న.

మూఢనమ్మకాలపై మల్లన్న…

ప్రజలు మూడనమ్మకాలతో నష్ట పోతున్నారని భావించిన మల్లన్న జనవిజ్ఞాన వేదిక గా ఆర్మూర్ డివిజన్ లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రాలు, తంత్రాలు, దయ్యాలు లేవు అంటూ ఇచ్చిన ప్రొగ్రాంలలో ముందున్నారు అతను.

వృద్దుల అసోషియేషన్ సేవలు..

ఉద్యోగ పదవీవిరమణ పొందితే ఎవరైనా ఏమి చేస్తారు.. రామ రామ అనుకుంటూ టైమ్ పాస్ చేస్తారు. కానీ.. మల్లన్న అందుకు భిన్నంగా వ్యవహరించారు. తనలాంటి వృద్దులతో ఒక సంఘం పెట్టారు. వృద్దుల బాధలను షేర్ చేసుకుని ఎవరికి బాధ వచ్చినా తాము అండగా ఉన్నామనే ధైర్యం ఆ వృద్దులకు ఇచ్చారు అతను. ఆ వృద్దుల అసోషియేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించారు. తుది శ్వాష వదిలే వరకు ప్రజాపంథాతో టచ్ లో ఉన్నారు.

మల్లన్నకు అవార్డులు..

వృద్దుల కోసం పని చేస్తున్న మల్లన్న సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రజల కోసం పరితపించే మల్లన్నకు అవార్డు ఇచ్చి సన్మానించింది. సీనియర్ సిటిజన్ సమస్యలపై స్పందించిన అతనిని నిజామాబాద్ పోలీసు కమీషనర్ సన్మానం చేశారు.

మల్లన్నా.. మీకు విప్లవ జోహార్లు అన్నా..

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking