Take a fresh look at your lifestyle.

ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి అండగా ఉంటానని..

0 287

ఆర్థిక సాయాన్ని అందించిన రేవంత్ రెడ్డి

జగిత్యాల, మార్చి 11, జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన జలపతి రెడ్డి తన ఇద్దరు కూతుర్లతో సహ ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పరామర్శించారు.

గత నెల రోజుల క్రితం ఇద్దరు కూతుర్లతో సహా ఆత్మహత్య చేసుకున్న రైతు జలపతి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మృతుడి భార్యకు ఆర్థిక సాయం అందించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

జలపతి రెడ్డి భార్య, పెద్ద కూతురు తో రేవంత్ రెడ్డి మాట్లాడి ఓదార్చారు. టీపీసీసీ వెంట ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు దేవెందర్ రెడ్డి, గిరి నాగభూషణం, గాజంగి నందయ్య, జున్ను రాజేందర్,గౌతమ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సలీమ్, గంగారెడ్డి,మహిపాల్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking