Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగులు

0 429

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి అభయ “హస్తం”

ఓటమి అనే ఆప్షన్ కూడా ఉండే ఛాన్స్ లేదు..   

హస్తం ఓట్లతో పొంగనున్న పొంగులేటి ఇమేజ్.

కాంగ్రెస్ కు పోతే ఖర్చు లేకుండానే గెలుపు తీరానికి ..

99% మంది కాంగ్రెస్ వైపుకు వెళ్లమని సూచన ..

ఖమ్మం మాజీ యంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారు దిగారు. తర్వాత ఏ పార్టీతో పయనించాలనే దాని పై తర్జన-భర్జన పడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి రాజకీయాలను ఆర్ధిక కోణంలో చూస్తున్నారనే విమర్శ ఉంది. తాను ఏ పార్టీ తీర్థం తీసుకున్న కాని తనకు జరగబోయే ఆర్ధిక ప్రయోజనం పైనే ఎక్కువ దృష్టి కేంద్రికరించడంతో అనేక మంది బహిరంగంగా వ్యాఖ్యనించకపోయిన అంతర్గతంగా లోలోపల అందరి మెదిలే మాట ఇదే.

దాంతో అనేక మంది శ్రీనివాస్ రెడ్డితో ఎక్కువ కాలం ఫాలోవర్ గా కొనసాగడం లేదు. కొన్ని రోజులకు ఒక సారి శ్రీనివాస్ రెడ్డి తన ఫాలోవర్స్ మార్పును గమనిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అడుగుల గురించి ప్రధాన చర్చ కొనసాగుతుంది.

కమలం గూటికి చేరాలంటే ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పట్టుమని పది సీట్లు గెలిచే స్థానాలు ఠక్కున చెప్పే పరిస్థితి బిజేపికి లేదు. 9 యేళ్ల నుంచి కేంద్రంలో బిజేపి పాలిస్తూంది, 9 యేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాని కేంద్రంలో కాని అధికారంలో లేకపోయినప్పటికి ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.

రాష్ట్ర , కేంద్ర పార్టీలకు కాంగ్రెస్ తోనే తమకు ముప్పు అనే పరిస్థితి ఏర్పడింది. ఏ సర్వే చేసిన కాని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని , కాంగ్రెస్ పార్టీ కావాలని 60 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోయిన , గ్రూపుల గోల ఉన్న కాని ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అయితేనే బాగుంటుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్న సర్వేలు అనేకం ఉన్నాయి.

భారత్ జోడో యాత్ర ద్వారా నార్త్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఇమేజ్ పెరిగింది. సినీ నటులు, మేధావులు , వ్యాపారస్థులు , సంఘ సంస్కర్తలు , రైతులు , మహిళలు , యువత , కమ్యూనిష్టు పార్టీలు కాంగ్రెస్ తో కలిసారు , కలుస్తున్నారు. కేంద్రంలో ఈ దఫా ఎన్నికల్లో ఇప్పుడున్న సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 210 కి పైగా యంపి స్థానాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. పార్టీ ఇమేజ్ ఎన్నికల వరకు ఇంకొంత పెరిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులభంగానే ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది.

ప్రపంచ వ్యాపితంగా బిజేపి పార్టీకి ఆ పార్టీ నాయకులకు విపరీతమైన ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక మంది పై మహిళలను వేధించిన కేసులు, హత్య కేసులు , అత్యచారాల కేసులు , దొంగ తనాల కేసులు , స్కాముల కేసులు , మతాధారిత వివాదస్పద వ్యాఖ్యలు చేసి ప్రపంచం ముందు తలవంపులు తెచ్చిన ఇలాంటి ఎన్నో ఘటనలతో బిజేపి విపరీతమైన వినాశనం వైపు పయనిస్తుంది.

దాంతో బిజేపి వద్ద ఆకర్షించేందుకు మత విద్వేషాలు తప్పా ఇతర అంశాలు , అభివృద్ధి అనే మంత్రాలు శూన్యం కావడంతో మెజారిటీ ప్రజలు బిజేపిని విమర్శించే పరిస్థితి ఏర్పడింది. మత విద్వేషాల వల్ల అనేక చోట్ల వ్యాపారాలు , విద్య వ్యవస్థ , అభివృధ్ది పనులు నిలిచిపోవడమే కాకుండా నిరుద్యోగం బాగా పెరిగిపోయి దేశం అత్యంత ప్రమాదపు అంచుల్లో ఉంది.

తెలంగాణలో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో దిగితే జిల్లాలో ఇప్పటికే బలమైన ఓటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే ఒక్కసారిగా రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ మైలేజ్ మరింతగా పెరుగుతుంది.

అవకాశం దొరికితే పార్టీని అధికారం లోకి తీసుకోని వస్తే శ్రీనివాస్ రెడ్డి డిప్యూటి సిఎం అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గెలుపొంది అధికారం తెచ్చిపెడితే కాంగ్రెస్ లో టాప్ 2 ఉంటారు. బిజేపి పార్టీ లో చేరి 99 శాతం కష్టపడిన అధికారం వచ్చే ఛాన్స్ కాదు కదా అసెంబ్లీలో ఉన్న ముగ్గురు మళ్లీ గెలుస్తారో లేదో చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే 10 శాతం కష్టపడితే అధికారం వచ్చి అరచేతిలో వాలిపోతుంది.

రేపు కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వచ్చి , టిఆర్ఎస్ బొటా బొటి సీట్లు వస్తే బిజేపి అనివార్యంగా టిఆర్ఎస్ కు మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దూరం చేస్తుంది. అప్పుడు శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.
కాంగ్రెస్ పార్టీని ఎన్నటికి ప్రజలు మరిచిపోరు , దూరం పెట్టరు .. కాంగ్రెస్ పార్టీ లో వృధ్ద నాయకత్వం వృధాగా మారింది. వారే లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నటికి అధికారాన్ని కోల్పోయేదే కాదు.

బిజేపి లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి , వివేక్ , డికే అరుణ , బొడిగే శోభ , శశిధర్‌ రెడ్డి , విజయశాంతి , రాజగోపాల్ రెడ్డి , జిట్టా , రాణి రుద్రమ , జితేందర్ రెడ్డి ఇలా మరెంతో మంది పరిస్థితి అగమ్యగోచరంగా ఉండటమే కాకుండా కక్క లేక మింగలేకా ఏదో నెట్టుకురావడం తప్పా చేసేది లేక మౌనం వహిస్తున్నారు.

ఇందులోనే అనేక గ్రూపులున్నాయి. ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వారిని వ్యక్తిగత నినాదాలు ఇచ్చే వారిని బిజేపి పార్టీ పదవులకు దూరం చేస్తుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితిలో ఉన్న పార్టీలో చేరి తాను కూడా మౌన ప్రదర్శన చేస్తారో లేక హస్తం పట్టుకొని ప్రమాణాస్వీకారం చేస్తారో శ్రీనివాస్ రెడ్డి తేల్చుకోవాల్సి ఉంది.

  • వయ్యామ్మెస్

Leave A Reply

Your email address will not be published.

Breaking