Take a fresh look at your lifestyle.

పాపం… వైఎస్ షర్మిల ఒంటరిగానే ఎన్నికల బరిలోకి..

0 15

పాపం… వైఎస్ షర్మిల

ఒంటరిగానే ఎన్నికల బరిలోకి..

అదృష్టం బాగలేక పోతే అరటి పండు తిన్న పళ్లు ఊడిపోతాయట.. ఇదో.. సామెత. కానీ.. పుట్టిన ఆంధ్రప్రదేశ్ ను, అన్న జగన్ రాజకీయాలను వదిలి తెలంగాణలో పట్టు సాధించడానికి పాదయాత్రలు చేసిన వై ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం ఫైనల్ అన్నారు.. కానీ.. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యులే అభ్యంతరం వ్యక్తం చేయడం తో తప్పని సరిపరిస్థితిలో ఒంటరిగా పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటుంది షర్మిల. 

నిర్దేశం, హైదరాబాద్ :

వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేయడమే విచిత్రం. అన్న ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ఉండగా, అతనితో ఏర్పాడిన విభేదాలు తార స్థాయికి రావడంతో తప్పనిసరి పరిస్థితులలో తెలంగాణ కోడలు పేరుతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తండ్రి పేరుతో పార్టీ పెట్టి తనదైన శైలిలో రాజకీయాలు నిర్వహించిన షర్మిల కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ గా తీవ్రమైన ఆరోపణలు చేసి తన ఉనికిని చాటుకుంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పుంజుకోవడంతో షర్మిల తన పార్టీని విలీనం చేయడానికి ఢిల్లీ లెవల్ లో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో లోకల్ లీడరులు అభ్యంతరంతో తప్పని సరి ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి షర్మిలకు ఏర్పడ్డది.

పాలేరులో రసవత్తరంగా రాజకీయాలు..

ఒంటరిగా పోటీ చేయడానికి  షర్మిల సిద్దం..?

ఒంటరి పోరుకు దిగితే కచ్చితంగా పాలేరు నుంచే పోటీ చేస్తారు షర్మిల. అప్పుడు ఎవరిని ప్రత్యర్ధిగా చూస్తారనేది ఆసక్తికర అంశం. బీఆర్ఎస్‌ అభ్యర్ధిని టార్గెట్‌ చేస్తారా లేదంటే పాలేరు టికెట్‌ ఆశిస్తున్న తుమ్మల నాగేశ్వరరావుతో ఫైట్ చేస్తారా? ఒకవేళ తుమ్మల గనక ఖమ్మం సీటు తీసుకుని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు బరిలో దిగితే మాత్రం పోటీ మరింత రసవత్తరంగా ఉంటుంది. ఒకవిధంగా ఇది షర్మిలను ఇరుకునపెట్టడమే అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఖమ్మంలో పదికి పది సీట్లు గెలుస్తామని పొంగులేటి శపథం చేసిన నేపథ్యంలో షర్మిలను గెలవనివ్వకపోవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా.. విలీనంపై షర్మిల వేసిన అడుగులు లాభం కంటే నష్టమే ఎక్కువ తెచ్చిపెట్టింది. వైఎస్‌ మీద అభిమానం కావొచ్చు, సమస్యలపై షర్మిల పోరాడుతున్న తీరు కావొచ్చు. కొంతమంది నేతలైతే ఆమె వెనక నడిచారు.

విలీనం పేరుతో దూరమైన ముఖ్యనేతలు

కాని, ఎప్పుడైతే విలీనం చేయాలనే ఆలోచన మొదలుపెట్టారో అప్పటి నుంచి ఒక్కో లీడర్‌ పార్టీని వీడుతూ వచ్చారు. కొండా రాఘవరెడ్డి, గట్టు రామచంద్రరావు, ఏపూరి సోమన్న.. ఇలాంటి వాళ్లంతా షర్మిల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు విలీనంపై వెనక్కి తగ్గినా.. మళ్లీ నేతలు తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు. ఓవరాల్‌గా రాజకీయ పరిణతి లేకపోవడంతోనే షర్మిల కొన్ని రాంగ్‌ స్టెప్స్‌ వేశారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. షర్మిలలో రాజకీయ పరిణితి కూడా కనిపించలేదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. కష్టమో నష్టమో ముందు పార్టీని నడపాలి. ఎన్నికల్లో పోటీ చేయాలి. గెలుపో ఓటమో తరువాత సంగతి. అసలు పార్టీకి ఉన్న సత్తా ఏంటన్నది బయటపడుతుంది కదా. సీట్లు గెలవకపోయినా.. చూపించడానికి కనీసం ఓట్ షేర్‌ అయినా ఉంటుంది కదా. ఇవేమీ జరక్కుండానే పార్టీ విలీనం కోసం ప్రయత్నించడం అంటే.. ఫెయిల్యూర్‌ను అంగీకరించడం కాదా? ఏ ఒక్క ఎన్నికను ఫేస్ చేయకుండానే విలీన ప్రతిపాదన పెట్టారంటే.. పార్టీని నడపడం అంత ఈజీ కాదని షర్మిలకు అర్ధమై ఉండాలి.

షర్మిల పాదయాత్ర చేసినా రెస్పాన్స్..?

4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఆ రేంజ్ రెస్పాన్స్ రాలేదని తెలుసుకుని ఉండాలి. లేదా ఆర్థిక వనరులైనా అడ్డం వచ్చి ఉండాలి. ఇవన్నీ పార్టీ అధ్యక్షురాలిగా తనకే అర్ధమైపోతున్నప్పుడు.. రాజకీయాల్లో కాకలుతీరిన నేతలకు ఆమాత్రం అర్దం కాదా? విలీనం కోసం నాలుగు నెలలుగా వెంటపడుతున్నారంటే.. తెలంగాణలో ప్రభావం చూపించలేకపోయారు కాబట్టే పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తున్నారని.. చూస్తున్నవాళ్లు అర్ధం చేసుకోలేరా? అసలు విలీనం ఊసెత్తకుండా.. ఆ పాలేరుపై ఫోకస్‌ పెట్టినా బాగుండేదని అంటున్నారు. ఏమో గెలుపు అవకాశాలు ఉండేవేమో.

Leave A Reply

Your email address will not be published.

Breaking