Take a fresh look at your lifestyle.

ప్రకృతి మాత్రమే శాశ్వతమైనది

0 11

ప్రకృతి మాత్రమే శాశ్వతమైనది
-మంత్రి కొండా సురేఖ
నిర్దేశం, వరంగల్ :
ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే, మానవ మనుగడకు ఆధారంగా నిలుస్తున్న అడవులను జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించేందుకు ప్రేరణ లభిస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

ప్రకృతిని సంరక్షిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించడమే అర్థవంతమైన జీవితమని మంత్రి తెలిపారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని (మార్చి 21) పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ తన భావాలను పంచుకున్నారు. అడవులను సంరక్షించుకునే దిశగా ప్రజలకు అవగాహన కలిగించే నిమిత్తం ప్రతి యేడు మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మంత్రి సురేఖ అన్నారు.

అడవుల ప్రాముఖ్యత, అడవులతో మనిషికి ఉన్న అనుబంధం, అడవుల సంరక్షణకు అనుసరించాల్సిన కార్యాచరణ, అడవులను సంరక్షించుకోకపోతే తలెత్తె విపత్కర పరిస్థితులను అటవీ దినోత్సవం సందర్భంగా అవలోకనం చేసుకోవాల్సిన అవసరమున్నదని మంత్రి అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ యేడు “అడవులు మరియు ఆవిష్కరణలు : మెరుగైన ప్రపంచం కోసం కొత్త పరిష్కారాలు” థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా అటవీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking