Take a fresh look at your lifestyle.

స్కౌట్స్ & గైడ్స్ విద్యార్థులలో జాతీయత పెంపొందిస్తోంది

0 13

స్కౌట్స్ & గైడ్స్ విద్యార్థులలో జాతీయత పెంపొందిస్తోంది
– స్కౌట్స్ & గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె. సాల్మన్

స్కౌట్స్ & గైడ్స్ ద్వారా విద్యార్థులలో దేశభక్తి, ఉత్తమ వ్యక్తిత్వం, క్రమశిక్షణ, జాతీయత భావం పెంపొందుతాయని మానవీయతతో కూడిన ఆలోచనలు ఉత్తమ సమాజ నిర్మాణానికి పునాది అవుతుందని స్కౌట్స్ & గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె. సాల్మన్ తెలిపారు. స్కాట్స్ & గైడ్స్ వ్యవస్థాపకులు రాబర్ట్ బడెన్ పావెల్ 167వ జయంతి, ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.

మొదటగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య, స్కౌట్స్ & గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె. సాల్మన్ బడెన్ పావెల్, క్లెయిర్ స్మిత్ దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనైనది. కె. సాల్మన్ మాట్లాడుతూ సైనికాధికారిగా విధులు నిర్వహిస్తూ బడెన్ పావెల్ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు సేవలందించడానికి పిల్లలను ఉపయోగించుకొని వారిలో సేవాభావం, మానవత్వం జాతీయత భావాలను చిగురింప చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో చేసిన కృషి శ్లాఘనీయమన్నారు.

చిన్నారులలో చురుకుదనం, ఉత్సాహం, స్నేహశీలత, సహనం పట్టుదలను చూసిన పావెల్ బాలుర బృందాలను స్కౌట్స్ అని బాలికల బృందాలను గైడ్స్ నామకరణతో స్ఫూర్తిని నింపారని తెలిపారు. దేశంకోసం జీవితాలను త్యాగం చేసిన పావెల్, తన భార్య అలేవ్ సెంటర్ ల స్ఫూర్తితో విద్యార్థులు సమాజసేవలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్బంగా స్కౌట్స్ & గైడ్స్ పతాకావిష్కరణ, సర్వ మత ప్రార్థనలు మరియు మొక్కలు నాటడమైనది. జాతీయభావం పరిణవిల్లెలో చేసిన పాటలు ప్రసంగాలు అందరిని అలరింపజేశాయి. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్ వనిత, స్కౌట్ మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking