Take a fresh look at your lifestyle.

మోదీ 3.0లో అనేక మార్పులు.. కేంద్ర మంత్రి వర్గం ఫుల్ లిస్ట్

మోదీ మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేశారు. ఎన్డీయే పార్టీలకు మంత్రి వర్గంలో పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారు. ఒకటి, రెండు స్థానాలు గెలిచిన పార్టీలకు సైతం మంత్రులుగా అవకాశం కల్పించారు.

0 71

నిర్దేశం, న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయిన ఘనత జవహార్ లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. ఇదిలా ఉంటే, మోదీ మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేశారు. ఎన్డీయే పార్టీలకు మంత్రి వర్గంలో పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారు. ఒకటి, రెండు స్థానాలు గెలిచిన పార్టీలకు సైతం మంత్రులుగా అవకాశం కల్పించారు. ఇకపోతే, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి మంత్రి వర్గంలో ప్రధాన్యత కల్పించలేదు. ఉదహారణకు తెలంగాణను తీసుకుంటే.. ఈటల రాజేందర్ కు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నప్పటికీ, మొదటి నుంచి పార్టీలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకే అవకాశం దక్కింది. జాతీయ స్థాయిలో ఇదే ప్రభావం కనిపిస్తోంది.

మోదీ 3.0 ప్రభుత్వంలోని కేంద్ర మంత్రుల ఫుల్ లిస్ట్
*కింజరాపు రామ్ మోహన్ నాయుడు (టీడీపీ) – ఆంధ్రప్రదేశ్
*చంద్రశేఖర్ పెమ్మసాని (టీడీపీ) – ఆంధ్రప్రదేశ్
*అమిత్ షా (బీజేపీ) – గుజరాత్
*సీఆర్ పాటిల్ (బీజేపీ) – గుజరాత్
*మన్సుఖ్ మాండవియా (బీజేపీ) – గుజరాత్
*జేపీ నడ్డా (బీజేపీ) – హిమాచల్
*అజయ్ తమ్తా (బీజేపీ) – ఉత్తరాఖండ్
*రవ్‌నీత్ బిట్టు (బీజేపీ) – పంజాబ్
*నితిన్ గడ్కరీ (బీజేపీ) – మహారాష్ట్ర
*రక్షా ఖడ్సే (బీజేపీ) – మహారాష్ట్ర
*ప్రతాప్ రావ్ జాదవ్ (షిండే వర్గం) – మహారాష్ట్ర
*పీయూష్ గోయల్ (బీజేపీ) – మహారాష్ట్ర
*మురళీధర్ మోహోల్ (బీజేపీ) – మహారాష్ట్ర
*రాందాస్ అథవాలే (ఆర్పీఐ) – మహారాష్ట్ర
*శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ) – మధ్యప్రదేశ్
*జ్యోతిరాదిత్య సింధియా (బీజేపీ) – మధ్యప్రదేశ్
*సావిత్రి ఠాకూర్ (బీజేపీ) – మధ్యప్రదేశ్
*జితన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం) – బీహార్
*రాంనాథ్ ఠాకూర్ (జేడీయూ) – బీహార్
*నిత్యానంద్ రాయ్ (బీజేపీ) – బీహార్
*గిరిరాజ్ సింగ్ (బీజేపీ) – బీహార్
*చంద్ర ప్రకాష్ (బీజేపీ) – జార్ఖండ్
*అనపూర్ణా దేవి (బీజేపీ) – జార్ఖండ్
*రాజ్‌నాథ్ సింగ్ (బీజేపీ) – ఉత్తరప్రదేశ్
*జితిన్ ప్రసాద్ (బీజేపీ) – ఉత్తరప్రదేశ్
*పంకజ్ చౌదరి (బీజేపీ) – ఉత్తరప్రదేశ్
*అనుప్రియా పటేల్ (అప్నాదళ్) – ఉత్తరప్రదేశ్
*జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ) – ఉత్తరప్రదేశ్
*బీఎల్ వర్మ (బీజేపీ) – ఉత్తరప్రదేశ్
*సంజయ్ బండి (బీజేపీ) – తెలంగాణ
*జి కిషన్ రెడ్డి (బీజేపీ) – తెలంగాణ
*కృష్ణపాల్ గుర్జర్ (బీజేపీ) – హర్యానా
*రావ్ ఇంద్రజిత్ సింగ్ (బీజేపీ) – హర్యానా
*మనోహర్ లాల్ ఖట్టర్ (బీజేపీ) – హర్యానా
*కిరణ్ రిజిజు (బీజేపీ) – అరుణాచల్
*సర్బానంద సోనేవాల్ (బీజేపీ) – అస్సాం
*శంతను ఠాకూర్ (బీజేపీ) – పశ్చిమ బెంగాల్
*హర్ష్ మల్హోత్రా (బీజేపీ) – ఢిల్లీ
*శోభా కరంద్లాజే (బీజేపీ) – కర్ణాటక
*హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్)- కర్ణాటక
*ప్రహ్లాద్ జోషి (బీజేపీ) – కర్ణాటక
*సురేష్ గోపి (బీజేపీ) – కేరళ

Leave A Reply

Your email address will not be published.

Breaking