Take a fresh look at your lifestyle.

విజయశాంతికి ఏమైంది..?

0 29

విజయశాంతికి ఏమైంది..?

కాంగ్రెస్ సీనియర్ నేత, సినిహీరోయిన్ విజయశాంతి అడ్రసు ఎక్కడా అనే చర్చ జోరుగా జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి లోక్ సభ ఎన్నికలలో కనుమరుగు కావడానికి కారణం ఏమిటని సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణ రాజకీయాల్లోనే తనదైన రాజకీయాలు చేసిన విజ‌య‌శాంతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సినీ నేపథ్యం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమెకు పెద్ద ఫాలోయింగ్ ఉంది. అయినా ఆమెతో ఎన్నికల ప్రచారం చేయించక పోవడం కాంగ్రెస్ పార్టీకి నష్టమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఒక సందర్భంలో తాను కాంగ్రెస్‌లో చేర‌డం సొంత ఇంటికి వ‌చ్చిన‌ట్లు ఉందంటూ విజయశాంతి కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో విజయశాంతి పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ.. పోటీ చేయక పోవడంతో లోక్ సభకు మెదక్ నుంచి పోటీ చేస్తుందని భావించారు.

ఈ ఎన్నికలలో పోటీ చేయక పోవడానికి కారణాలు తెలియ రాలేవు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత విజయశాంతి కనిపించకుండా పోయారనేది టాక్.

Leave A Reply

Your email address will not be published.

Breaking