రాజన్న గుడిలో ప్రైవేటు వ్యక్తుల తిష్ఠ
నిర్దేశం, వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం లో ప్రైవేట్ వ్యక్తులు హల్ చల్ చేస్తున్నారు. మేడారం భక్తుల రద్దీ ని ఆసరాగా చేసుకొని దర్శనాలు కోసం భక్తుల నుండి ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు గుంజుతున్నారు. .దర్శనం కోసం గంటల సమయం పడుతుండడంతో రాజన్న ఆలయంలో ప్రైవేట్ వ్యక్తుల హవా కొనసాగుతుంది. ఒక్కో దర్శనం కోసం ఒక్కో రేట్ నిర్ణయం చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇంత తంతు కొనసాగుతున్నా ఆలయ అధికారులు మౌనంగానే ఉండడంపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కొద్ది మంది ఆలయంలో నే తిష్టవేసి మరీ దర్శనాల పేరిట డబ్బులు గుంజుతున్నారు, ఆలయ సమీపంలో ఓ వ్యక్తి దర్జాగా దర్శనం కోసం డబ్బులు తీసుకుంటుండగా వీడియోస్ బయటకు వచ్చాయి.