హవ్వా, ఇదేం దారుణం.. మోదీ మంత్రివర్గంలో చేరడం కోసం క్షుద్ర పూజలు?

నిర్దేశం, న్యూఢిల్లీ: మరికొద్ది సేపట్లో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కానున్నారు. ఇదే సమయంలో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఒక వివాదస్పదమైన విషయం ఏంటంటే.. మంత్రులు కావాలనే తపనతో పలువురు నేతలు క్షుద్ర పూజలు చేస్తున్నారనే చర్చ ప్రకంపనలు సృష్టిస్తోంది.

మీడియా కథనాల ప్రకారం.. 4 రాష్ట్రాలకు చెందిన 30 మందికి పైగా ఎంపీలు మోదీ 3.0 క్యాబినెట్‌లో చేరడానికి క్షుధ్ర పూజ చేశారట. ఇందులో చాలా మంది బీహార్ నాయకులే ఉన్నారని, మంత్రులు కావాలనే కోరికతో తంత్ర మంత్రాలు, కర్మకాండలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక గతంలో మంత్రులుగా ఉన్న వారు ఈ లిస్టులో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

దైనిక్ భాస్కర్ నివేదిక ప్రకారం.. బీహార్ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 6 మంది, రాజస్థాన్ నుంచి 4, మహారాష్ట్ర నుంచి 6 మంది ఎంపీలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కర్మలు చేస్తున్నారట. 30 మంది ఇలాంటివి చేయగా అందులో 12 మందికి మంత్రులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ జ్యోతిష్యుడు చెప్పడం విడ్డూరం.

చాలా మంది ఎంపీలు బీహార్ సీఎం నితీష్ కుమార్, నరేంద్ర మోదీలను ప్రభావితం చేయాలనుకునే ఆకర్షణ పూజలు చేస్తున్నారట. ఈ పద్ధతి ద్వారా తమ పేరు నితీష్ కుమార్, నరేంద్ర మోదీలకు గుర్తుకు రావాలని, తమ పేరును ఆమోదించాలని ఎంపీలు కోరుతున్నారు. ఇదే కాదండోయ్.. తమకు పోటీగా వచ్చే వారి మీద వికర్షణ పూజలు కూడా చేస్తున్నారట. అంటే, వారి పేర్లను మంత్రులుగా ప్రతిపాదనలోకి తీసుకోవద్దనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారట.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »