Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌తో భేటీ అయిన మ‌ల్లారెడ్డి..

0 10

కేసీఆర్‌తో భేటీ అయిన మ‌ల్లారెడ్డి..

నిర్దేశం, హైదరాబాద్:

బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డిని పిలిపించి కేసీఆర్ మాట్లాడారు. అయితే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది.

కేసీఆర్ తో భేటీలో ఈ విషయంపై మల్లారెడ్డి చర్చించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎంపీ టికెట్ మా కుటుంబ సభ్యులకు వద్దని కేసీఆర్ కు మల్లారెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ మార్పు విషయంపైనా కేసీఆర్ వద్ద మల్లారెడ్డి ప్రస్తావించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, మీవెంటే నడుస్తానని కేసీఆర్ కు మల్లారెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking