Take a fresh look at your lifestyle.

చూసీ చూడనట్టు…!

0 14

చూసీ చూడనట్టు…!

అదుగో…
మీ చుట్టూ
పసి పువ్వులు ఏడుస్తున్నాయి చూడండి
చూసేసారా…

ప్రాణాలు గిలగిలా కొట్టుకుని
నిస్సహాయంగా మీ వైపు చూస్తూ
పువ్వులు చచ్చిపోతున్నాయి చూడండి
చూసేసారా…

అవును
మీ చుట్టే…
బోలెడు సమాధులు వెలిసాయి చూడండి
అదీ చూసేసారా…

ఇక కంచం ముందరికి వెళ్ళి
కడుపు నిండా తిని
కంటి నిండా హాయిగా నిదుర పొండి…
మీ కోసం కమ్మటి కలలు కూడా కనండి!

రేపటి ఏడుపు
రేపటి చావు
రేపటి సమాధి
ఎవ్వరిదో ఎవ్వరికీ తెలియదు!

జి. కళావతి

(గాజాపై ఇజ్రాయెల్ దాడిలో ఏడుస్తున్న, గాయపడిన, మరణించిన పసిపిల్లల దృశ్యాలు చూసి తల్లడిల్లిన హృదయంతో…)

Leave A Reply

Your email address will not be published.

Breaking