Take a fresh look at your lifestyle.

నిజాం ఎనిమిదవ వారసుడు ముకర్రం జా జీవితం

0 591

ముకర్రం జా జీవిత ప్రస్థానం..

  • విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించిన ముకర్రం జా
  • జవహర్ లాల్ నెహ్రూకి గౌరవ సహాయకుడిగా.. 
  • ఎనిమిదో నిజాం వారసుడు ముకర్రం జా..
  • టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆనారోగ్యంతో ముకర్రం జా మరణం..
  • ముకర్రం జా చివరి కోరిక తీర్చిన కుటుంభీకులు
  • ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించవద్దని కమ్యూనిష్టుల డిమాండ్
  • ప్రభుత్వ లాంచనాలతోనే ముకర్రం జా అంత్యక్రియలు
  • ముకర్రం జా కు స్వయంగా నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

నిజాం గురించి నమ్మలేని నిజాలు..

‘‘బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే పోతావ్ కొడుకో.. నైజాం సర్కారోడా..? నాజీలను మించినవురో నైజం సర్కారోడా..? పోలీసు మిలిట్రి రెండు బలవంతులనుకొని నువ్వు పల్లెల దోస్తీవి కొడుకో మా పల్లెలు దోస్తీవి కొడుకో నైజము సర్కారోడా.. స్త్రీ పురుషులంత గలిసి ఇల్లాలమంత గలిసి వడిసేల రాళ్లు గట్టి వడివడిగ గొట్టితేను కారాపు నీళ్లు దెచ్చి కండ్లళ్ల జల్లితేను నీ మిలిట్రి బారిపొయెరో నీ మిలిట్రి బారిపొయెరో… నైజాము సర్కరోడా.. సుట్టుముట్టూ సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ నువ్వుండేది హైద్రబాదు దాని పక్క గోలుకొండ గోలుకొండా ఖిలా కిందా గోలుకొండా ఖిలా కిందా నీ గోరి కడుతం కొడుకో నైజాము సర్కరోడా’’

బండి యాదగిరి రాసిన ఈ పాట నిజాం పాలనలోఅందరి నోట వినిపించేది. గద్దర్ తనదైన శైళిలో పాడిన ఈ పాటకు మాభూమి సినీమాలో పాడి నిజాం సర్కార్ దుర్మార్గుడనే భావన ప్రజల్లో కలిగింది.

నిజాం పాలనంతా నాజీలను మించి పోయిందని ప్రజల ముందు నిజాంను దోషిగా పెట్టిన ఘనత కమ్యూనిష్టులదే. కానీ.. ఆ నిజాం రాజు నాడు చేసిన అభివృద్ది పనులు ఇప్పటికీ సజీవంగా కళ్ల ముందు కనిపిస్తున్నాయి.

ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు నాడు నిజాం పాలనలో జరిగినవే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత ముక్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నిజాం పాలన భేష్.. అప్పట్లో జరిగిన సంక్షేమ పథకాలు ఇప్పటికి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.

ముకర్రం జా అంత్యక్రియలపై రాజకీయ నీడ..

నిజాం రాజు ఎనిమిదవ వారసుడు ముకర్రం జా బహదూర్ మరణం కూడా  రాజకీయాలకు వేదికగా మారింది. అయితే.. ముకర్రం జా బహదూర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తే నాడు జరగిన రైతాంగ సాయుధ పోరాటంను అవమానించినట్లుగా కమ్యూనిష్టులు పేర్కొన్నారు.

బీజేపీ, విహెచ్ పి, ఆర్ ఎస్ఎస్ వారు కూడా ముకర్రం జా అంత్యక్రియలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా.. టర్కీలో మరణించిన అతని భౌతికదేహంకు స్వయంగా ముక్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అద్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ  నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ముకర్రం జా జననం..

ముకర్రం జా 1933, అక్టోబరు 6న ఆజం జా – యువరాణి దుర్రు షెహ్వార్ దంపతులకు హైదరాబాదులో జన్మించాడు. ఆజం జా హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు కాగా, యువరాణి దుర్రు షెహ్వార్ ఒట్టోమన్ రాజవంశం చివరి ఖలీఫా అబ్దుల్మెజిద్ కుమార్తె.

ముకర్రం జా విద్య..

ముకర్రం జా విద్యావంతుడు. ప్రపంచంలోనే ఉన్నత విద్యను అందించే విదేశీ యూనివర్సిటీలలో చదువుకున్నారు. డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో, ఇంగ్లాండ్‌లోని హారో, పీటర్‌హౌస్, కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లలో కూడా చదువుకున్నాడు.

నెహ్రూకి గౌరవ సహాయకుడిగా.. 

ముకర్రం జా న్యూ ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్‌లో కొంతకాలం ఉండి జవహర్‌లాల్ నెహ్రూకి గౌరవ సహాయకుడిగా పనిచేశాడు. నెహ్రూ తనను తన వ్యక్తిగత రాయబారిగా లేదా ముస్లిం దేశానికి భారత రాయబారిగా చేయాలని కోరుకున్నాడని 2010లో ముకర్రం జా పేర్కొన్నాడు.

హైదరాబాదు నిజాం 1934లో బొంబాయి చేరిన తర్వాత నానీ యువరాజును తీసుకెళ్తున్న దృశ్యం.

1967లో తన తాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణాంతరం హైదరాబాదు నిజాం అయ్యాడు.

మరణం, అంత్యక్రియలు

ముకర్రం జా తన 89 ఏళ్ళ వయసులో 2023, జనవరి 15న టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో మరణించాడు. ముకర్రం జా కోరిక ప్రకారం అతని అంత్యక్రియలు 2023 జనవరి 18న హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ నిజాం పూర్వ రాజధాని అయిన హైదరాబాద్‌ నగరంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి.

ప్రజల సందర్శనార్థ ముకర్రం జా భౌతికకాయాన్ని చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచబడింది, అక్కడ కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు నివాళులర్పించారు.

ముకర్రం జా వివాహాలు

ముకర్రం జా ఐదుసార్లు వివాహం చేసుకున్నాడు. అతని మొదటి భార్య టర్కిష్ ఉన్నత మహిళ, ఎస్రా బిర్గిన్ (జ. 1936)కాగా, వారు 1959లో వివాహం చేసుకున్నారు.జాహ్ తన హైదరాబాద్ ప్యాలెస్ నుండిఆస్ట్రేలియా  అవుట్‌బ్యాక్‌లోని షీప్ స్టేషన్ కోసం బయలుదేరాడు, అతనితో కలిసి వెళ్ళడానికి ఇష్టపడని తన భార్యకు విడాకులు ఇచ్చాడు. 1979లో మాజీ ఎయిర్ హోస్టెస్, బిబిసి ఉద్యోగి హెలెన్ సిమన్స్‌ను వివాహం చేసుకున్నాడు (జ. 1949 – మ. 1989); ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఆయిషాగా మార్చుకుంది. ఆమె మరణానంతరం అతను 1992లో మాజీ మిస్ టర్కీ అయిన మనోల్య ఒనూర్ (జ. 1954 – మ. 2017)ని వివాహం చేసుకున్నాడు. 1997లో ఆమెకు విడాకులు ఇచ్చాడు.

తరువాత 1992లో మొరాకో కు చెందిన జమీలా బౌలరస్ (జ. 1972)ను వివాహం చేసుకున్నాడు.1994లో టర్కిష్‌కు చెందిన యువరాణి ఆయేషా ఓర్చెడి (జ. 1959)ని వివాహం చేసుకున్నాడు.

ముకర్రం జా కుమారులు/కుమార్తెలు

ఎస్రా బిర్గిన్ ద్వారా, ముకర్రం జాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు:

  • అజ్మత్ జా అని కూడా పిలువబడే వాలాషన్ నవాబ్ సాహిబ్జాదా మీర్ అజ్మత్ అలీ ఖాన్ సిద్ధికీ బయాఫెండి బహదూర్ (జ. 1960), 1994లో యువరాణి బేగం సాహిబా జైనాబ్ నాజ్ జా (నీ జీనెప్ నాజ్ గువెండిరెన్)ని వివాహం చేసుకున్నాడు. ఒక కుమారుడు కెమెరామెన్‌గా పనిచేశాడు.
    • మురాద్ జా
  • సాహిబ్జాది షెహ్క్యార్ యునిసా బేగం (జ. 1964), అవివాహితుడు

హెలెన్ సిమన్స్ ద్వారా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు:

  • వాలాషన్ నవాబ్ సాహిబ్జాదా మీర్ అలెగ్జాండర్ ఆజం ఖాన్ సిద్ధికీ బయాఫెండి బహదూర్ (జ. 1979)
  • వాలాషన్ నవాబ్ సాహిబ్జాదా మీర్ మొహమ్మద్ ఉమర్ ఖాన్ సిద్ధిఖీ బయాఫెండి బహదూర్ (1984-2004) డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా మరణించాడు.

మనోల్య ఒనూర్ ద్వారా అతనికి ఒక కుమార్తె ఉంది:

  • సాహెబ్జాది నిలుఫెర్ యునిసా బేగం (జ. 1992)

జమీలా బౌలరస్ ద్వారా అతనికి ఒక కుమార్తె ఉంది:

  • సాహెబ్జాది జైరిన్ యునిసా బేగం (జ. 1994)

ముకర్రం జాకు ముఫఖం జా అనే సోదరుడు ఉన్నాడు.

హైదరాబాద్ లో నిజాం రాజభవనాలు

  • చౌమహల్లా ప్యాలెస్, హైదరాబాద్.
  • ఫలక్‌నుమా ప్యాలెస్, హైదరాబాద్.
  • నజ్రీబాగ్ ప్యాలెస్, హైదరాబాద్.
  • నౌఖండ ప్యాలెస్, ఔరంగాబాద్.
  • చిరాన్ ప్యాలెస్, బంజారాహిల్స్, హైదరాబాద్.
  • పురాణి హవేలీ హైదరాబాద్. (ముకర్రం జా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్)

ముకర్రం జా పై ఫిర్యాదు

7వ నిజాం మరో మనవడు నవాబ్ నజాఫ్ అలీ ఖాన్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌ను కలుసుకుని, ప్రిన్స్ ముకర్రం జా, అతని మాజీ భార్య ప్రిన్సెస్ ఎస్రా (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) హోల్డర్ కూడా అని ఆరోపిస్తూ మద్దతు పత్రాలతో పాటు ఫిర్యాదును సమర్పించాడు. యువరాజు ముకర్రం జా), అతని కుమారుడు ప్రిన్స్ అజ్మత్ జా, అతని సోదరుడు ప్రిన్స్ ముఫఖం జా యునైటెడ్ కింగ్ డమ్ హైకోర్టులో తప్పుడు పత్రాలను ఉపయోగించి అక్కడి నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న £35 మిలియన్ నిజాం ఫండ్‌పై దావా వేశారు.

ఏది ఏమైనా ముకర్రం జా జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. నిజాం వంశీయుడైన అతనికి నాటి నిజాం పాలనతో ఎలాంటి సంబంధం లేదనేది చరిత్ర

చెబుతున్న సత్యం.

  • యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

వికీపీడియా సౌజన్యంతో..

Leave A Reply

Your email address will not be published.

Breaking