Take a fresh look at your lifestyle.

10న ఢిల్లీలో కవిత నిరాహార దీక్ష

0 67

మహిళా రిజర్వేషన్ కోసం

10న ఢిల్లీలో కవిత నిరాహార దీక్ష

హైదరాబాద్: కవితా మజాకానా..? ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాజం కోడై కూస్తుంటే తాను మాత్రం మహిళాల కోసం పోరాటం చేస్తానని నిర్ణయించుకుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది.

గురువారం నాడు తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ పై బిజెపి చేర్చిందని, ఆ హామీని ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా కేవలం మూడు పార్లమెంటు సమావేశాలు మాత్రమే ఉన్నాయని, కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని అన్నారు.

తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తి పెంపొందించాలి అన్న లక్ష్యంతో పని చేసి, నేడు దేశవ్యాప్తంగా కూడా అదే పని చేయాలన్న ఉద్దేశంతో భారత్ జాగృతిగా రూపాంతరం చెందిందని గుర్తుచేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జంతర్మంతర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేయాలనే నిర్ణయించామని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking