Take a fresh look at your lifestyle.

ప్రపంచ స్థాయి టూరిజం స్పాట్ కరీంనగర్

0 50

ప్రపంచ స్థాయి టూరిజం స్పాట్ గా మారనున్న కరీంనగర్

69 కోట్లతో ఐలాండ్ వాటర్ ఫౌంటెన్ పనులకు భూమి పూజ

:  మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్, ఫిబ్రవరి 26 : కరీంనగర్ జిల్లాలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్  ప్రపంచ స్థాయిలో టూరిజం స్పాట్ గా జిల్లా మారనుందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

ఆదివారం మానేరు రివర్ ఫ్రంట్ లో 69 కోట్లతో బిగ్ ఓ ఐలాండ్ వాటర్ ఫౌంటెన్ నిర్మాణ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ ను ఆనుకుని ఉన్న 24 టీయంసిల వాటర్ బాడిని పర్యాటకంగా అభివృద్ది చేయాలనే ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆకాంక్ష మేరకు ఆహ్మాదాబాద్ లోని సబర్మతిని మించి మానేరు రివిర్ ఫ్రంట్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

మానేరు పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేసి అభ్బుతమైన పర్యాటక ప్రాంతాంగా తీర్చిదిద్దేలా 410 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు మంజూరు చేశారన్నారు.

ఇందులో 310 కోట్లు ఇరిగేషన్ శాఖ ద్వారా కన్షక్షన్ ఆఫ్ రిటర్నింగ్ వాల్స్ మరో 100 కోట్లతో పర్యాటక శాఖ ద్వారా యాక్టివిటి కొరకు మంజూరు చేయడం జరిగిందని పేర్కోన్నారు. ఇప్పటికే ఆర్ అండ్ బీ ద్వారా కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిచేసుకొని డైనమిక్ లైటింగ్ ను ఏర్పాటు చేసుకోబుతున్నామని అన్నారు. 3.7 కిలోమిటర్లతో మానేరుకు ఇరువైనపుల అభివృద్ది పనులను చేపట్టడంతో పాటు చెక్ డ్యాం నిర్మాణం కుడా చేసుకోవడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మేల్యే రసమయి బాలకిషన్, మెయర్ వై. సునీల్ రావు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణా రావు, గ్రంథాలయ చైర్మన్ అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, మున్సిపల్ కమీషన్ సేవా ఇస్లావత్, పంచాయితిరాజ్ అధికారులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking