Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులను సినిమా హీరోలు ఆదుకోవాలి – మచ్చా రామలింగారెడ్డి

0 62

మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్,నాగార్జున, మరియు తెలుగు సినిమా నిర్మాతలు కరోనాతో మృతిచెందిన !జర్నలిస్టు కుటుంబాలను దత్తత తీసుకోవాలి.

జర్నలిస్టులకు మాస్కులు, శ్యానిటైజర్లు పంపిణీ, జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి .జర్నలిస్టులకు కరోనా భృతి 10 వేలు ఇవ్వాలి.రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు కుటుంబాలకు వెంటనే కరోనా వ్యాక్సిన్ వేయాలి.జర్నలిస్టులకు 50 లక్షల హెల్త్ బీమా సౌకర్యం కల్పించాలి.జూన్ నుంచి జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం..
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నూతన కమిటీలు ఏర్పాటు

రాష్ట్రంలో కరోనా బారినపడి జర్నలిస్టులు ఇప్పటికే చాలా మంది మరణించారని వారి కుటుంబాలను సినిమా హీరోలు వెంటనే రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులను ఆదుకోవాలని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ డిమాండ్ చేశారు.సినిమా హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అల్లు అర్జున్, లాంటి హీరోలు కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఆదుకోవాలని వారి పిల్లలను చదివించాలని ఈ కష్ట సమయంలో జర్నలిస్టులకు అండగా ఉండాలని రామలింగారెడ్డి కోరారు..అనంతపురం R&B అతిథి గృహం నందు మచ్చా రామలింగారెడ్డి విలేకరుల సమావేశంలో ఈరోజు మాట్లాడారు..కరోనాతో చాలా జర్నలిస్టు కుటుంబాలు వీధిన పడ్డాయి అని సినిమా హీరోలు జర్నలిస్టుల వైపు చూడాలని సూచించారు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా జర్నలిస్టులను ఆదుకొని నిజమైన హీరోలుగా ఉండాలన్నారు.రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించాలని అన్నారు.డాక్టర్లు, పోలీసులు ఇతర వర్గాల మాదిరిగా జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని అన్నారు.కరోనాతో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని ఒక్కొక్క జర్నలిస్టుకు కరోనా భృతి కింద 10 వేల ఆర్థిక సాయం చేయాలని కోరారు.రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టు కుటుంబాలకు వెంటనే కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కరోనాతో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు అన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజన్, ప్రత్యేక బెడ్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించి PMGKY పథకం ద్వారా 50 లక్షల హెల్త్ బీమా సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలపై దృష్టిపెట్టి జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకోవాలని మచ్చా రామలింగా రెడ్డి కోరారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (A.P.W.J.U) నూతన కమిటీలను ఏర్పాటు చేస్తుందని కొత్త తరం జర్నలిస్టులకు కమిటీలో అవకాశం కల్పిస్తామని జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో ముందుకు కదలాలి అన్నారు. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికల కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్ని జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు కమిటీలో ఉంటారని అన్నారు.

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టు మన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (A.P.W.J.U) చేసే ఉద్యమంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, ఫోటోగ్రాఫర్లు, సీనియర్ జర్నలిస్టులు అందరూ పాల్గొనాలని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (A.P.W.J.U) కోరారు.మచ్చా రామలింగారెడ్డి జర్నలిస్టులకు మాస్కులు, శ్యానీటైజర్లు,పంపిణి చేశారు.విలేకర్ల సమావేశంలో వెంకటేశ్వర్లు, ఫోటో గ్రాఫర్ మారుతీ, విజయరాజు, ఉపేంద్ర చలపతి, జానీ, షకీర్, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు..

మచ్చా రామలింగారెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్
(A.P.W.J.U)

Leave A Reply

Your email address will not be published.

Breaking