Take a fresh look at your lifestyle.

జగిత్యాల్ మున్సిపల్ చైర్ పర్సన్ కు రాజీనామా..

0 209

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి.

రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మీడియా ముందు రోదిం

చారు.

కవిత అక్క మనుషులమని ఎమ్మెల్యే అణిచివేత

మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన భోగ శ్రావణి ప్రవీణ్ ప్రకటన

గడిచిన 3 సంవత్సరాల నుండి ప్రశ్నించడంతోనే ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులు గురి చేస్తున్నాడని  మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ ఆరోపించారు.  మీడియా సమావేశంలో ఆమె రోదిస్తూ మాట్లాడారు.

ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పోతున్న అని ఆవేదన చెందారు ఆమె. మీకు పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని ఎమ్మెల్యే భేదిరించారాని ఆరోపించారు శ్రావణి ప్రవీణ్. ఎమ్మెల్యే డబ్బులు కోసం డిమాండ్ చేస్తున్నారని. మేము ఇచ్చుకోలేం మన్నారు. దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్ష గట్టారు. ఎమ్మెల్యే అన్ని పనులకు అడ్డొస్తూ చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని హుకుం జారీ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే తో నరక ప్రాయంగా మున్సిపల్ చైర్మన్ పదవి ఉందని తెలిపారు. నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా నేను అవమానానికి గురయ్యాను పేర్కొన్నారు. ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లానని తెలిపారు. ఎమ్మెల్యే తో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చిన్నది అంటూ అవమానం పరిచారు. స్నేహితుడి కోసం కొత్త బస్టాండ్ ప్రాతం లో జంక్షన్ చిన్నగా కట్టిన వ్యక్తి ఎమ్మెల్యే, మూడు సంవత్సరాల నుండి నరకం అనుభవిస్తున్నన్నారు.

మీ రేంజ్ ఎంత చిన్న ప్రోటోకాల్ పెట్టుకొని అధికారులను ఎలా కలుస్తారని ఎమ్మెల్యే చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకూలంగా ఉన్న కొద్దీ మంది కౌన్సిలర్లకు టార్చర్ చేసి, అందరి ముందు అవమానించే వారన్నారు. జగిత్యాల పట్టణంలో బీసీ మహిళననే ఎమ్మెల్యే కక్ష గట్టారని ఆవేదన చెంది, సబ్బండ వర్గాలు రాజకీయాలకు పనికిరారా అనికంటతడి తో ఆవేదన.. పేరుకే మున్సిపల్ చైర్మన్ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యే దే అని మండిపడ్డారన్నారు చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్.

నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అక్క మనుషులమని ఎమ్మెల్యే అణిచివేత గురి చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బెదిరింపులు చేస్తున్నారని, జిల్లా ఎస్పీ నా కుటుంబం కు రక్షణ కల్పించాలని కోరారు చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్. ఎమ్మెల్యే అడ్డు పడ్డా అభివృద్ధి వైపే ఉన్నామన్నారు. నాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఎమ్మెల్యే ఇవ్వలేదు. ఆయన స్క్రిప్ట్ ఏ చదవాలని , కవిత ను కలవకూడదు. కేటీర్ పేరు ప్రస్థావించకూడదు అని హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యేతో నరక యాతనకు గురి అయ్యాము.

ఆశీర్వదిస్తూ కవిత ఇంటికి వస్తే ఎమ్మెల్యే వేధింపులు చేశారు. ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే తో మాకు ఆపద ఉందని. మా కుటుంబానికి ఏమైనా జరిగితే సంజయ్ కుమార్ కారణం అవుతారని ఆవేదన వ్యక్తంచేశారు. రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి వేడుకొన్నారు. సహకరించిన ముఖ్యమంత్రి సీఎం, కేటీర్, కవిత అక్క, కొప్పుల ఈశ్వర్ కి, ఎమ్మెల్సీ రమణ అందరికి ధన్యవాదములు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking