Take a fresh look at your lifestyle.

ఓటు ఉన్నదో..? లేదో..? తెలుసుకోండి

0 26

ఓటు ఉన్నదో..? లేదో..? తెలుసుకోండి
నిర్దేశం, హైదరాబాద్‌:
ఈనెల 30న పోలింగ్‌ జరగనున్నది. ఇప్పటికే ఓటు హక్కు నమోదు ప్రక్రియ కూడా పూర్తయింది. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ ఓటు ఉన్నదా? లేదా? ఓటు ఉంటే పోలింగ్‌ స్టేషన్‌ ఎక్కడ? అన్న విషయాలను తెలుసుకోవటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఓటు ఉన్నదో, లేదోనన్నది https:// electoralsearch.eci.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.ఈ వెబ్‌సైట్‌కు వెళ్లి పేరు, ఇతర వివరాలు నమోదు చేయడం ద్వారా, ఓటరు కార్డు నంబర్‌ నమోదు చేయడం ద్వారా, ఫోన్‌ నంబర్‌ ద్వారా ఓటుకు సంబంధించిన వివరాలు పొందవచ్చు. ఓటు హక్కు ఉంటే వివరాలన్నీ కనిపిస్తాయి. పేరు, తండ్రి పేరు, ఓటరు కార్డు నంబర్‌, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్‌ కేంద్రం, ఓటరు జాబితాలో సీరియల్‌ నంబర్‌ ఉంటాయి.ఈ వివరాలను ప్రింట్‌ తీసుకోవచ్చు. ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొని ఓటరు వివరాలు నమోదు చేయడం, ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ ఎంటర్‌ చేయటం, బార్‌ కోడ్‌, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఓటు ఉన్నదో, లేదో తెలుసుకోవచ్చు. పోలింగ్‌ స్టేషన్‌ గురించి తెలుసుకోవటానికి కూడా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌లో ఓటరు కార్డు నంబర్‌ నమోదు చేయడం ద్వారా పోలింగ్‌స్టేషన్‌ను తెలుసుకోవచ్చు. నో యువర్‌ పోలింగ్‌ స్టేషన్‌పై క్లిక్‌ చేస్తే అక్కడ ఓటరు కార్డు నంబర్‌ అడుగుతుంది. ఎంటర్‌ చేస్తే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌, సీరియల్‌ నంబర్‌, పోలింగ్‌ స్టేషన్‌ అడ్రస్‌ చూపిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking