Take a fresh look at your lifestyle.

ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టిన ఇల్లు : రాష్ట్రపతి

0 64

ఢిల్లీ : రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన భారత దేశపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లని వ్యాఖ్యానించారు.

విశ్వశాంతికి భారత్ కట్టుబడి ఉందని, జీ-20 సదస్సు నిర్వహణ మన ప్రతిష్ఠను పెంచుతుందన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని, దేశ ప్రగతికి పాటుపడుతున్న ప్రతి భారతీయుడికి అభినందనలు తెలిపారు.

బోర్డర్ లో ఉంటూ దేశాన్ని కాపాడుతున్న జవాన్ల వీరత్వాన్ని రాష్ట్రపతి కొనియాడారు. భారత్ అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచిందని.. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కలిపే వేదిక డిజిటల్ ఇండియా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

రాజ్యాంగాన్ని అనుసరించడం మన కర్తవ్యమని, రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ కి దేశం రుణపడి ఉందని రాష్ట్రపతి వెల్లడించారు.

అన్నివేళలా రాజ్యాంగమే మనకు మార్గదర్శి అని, వివిధ భాషలు, సంస్కృతులు మనల్ని కలిపి ఉంచుతున్నాయని వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking