Take a fresh look at your lifestyle.

పార్లమెంట్ ఎన్నికలలో..

0 32

పార్లమెంట్ ఎన్నికలలో..
– సవాల్ చేసిన కవిత చల్ల బడ్డది
– బీఆర్ ఎస్ కు అభ్యర్థి కరువైంది
– బాజిరెడ్డిని బుదిరికిస్తున్న అధిష్ఠానం
– కాంగ్రెస్ – బీజేపీలకు పెరిగిన అభ్యర్థుల తాకిడి

(ఈదుల్ల మల్లయ్య)
కల్వకుంట్ల కవిత.. ఆ పేరులో పవర్.. ఆమె ఏది చెబితే అదే.. కారణం..? సీఎం కేసీఆర్ ముద్దుల కూతురు.. ప్రభుత్వం మారింది. అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష హోదాకు సరిపెట్టుకుంది బీఆర్ ఎస్. సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు. రాజకీయ సమీకరణాలు కూడా మారాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ – కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికలు జరుగుతాయని విశ్లేషకుల భావన..
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలిగా పోటీ చేసి నడి రోడ్ లో ఓడిస్తానని బీజేపీ ఎంపీ అరవింద్ కు సవాల్ విసిరింది కవిత. కానీ.. ఓడి పోతానని సర్వేలు చెప్పాయో.. ఏమో.. పోటీ నుంచి ఆమె పారి పోయింది. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న..
కాంగ్రెస్ – బీజేపీ నుంచి పోటీ చేయడానికి డజన్ కు పైగానే అభ్యర్థులు క్యూలో ఉన్నారు. అదే బీఆర్ ఎస్ అభ్యర్థి కోసం టార్చ్ లైట్ తో వెతికినా కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ కూతురు కవిత పోటీ చేయడం లేదు. ఇప్పుడు నిజామాబాద్ నుంచి పోటీ చేసి బలి పశువు ఎవరని జోక్ లు వేసుకుంటున్నారు.
అంతో.. ఇంతో ప్రజలతో సంబంధాలు ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బీజేపీ – కాంగ్రెస్ లకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ కారు ఖాళీ గా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking