Take a fresh look at your lifestyle.

కొత్తగా ఇల్లు కట్టుకుంటే మీకు మూడు లక్షాలు

0 110

సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణానికి రూ.7,350 కోట్లు

హైదరాబాద్ : రాష్ట్రంలో సొంత స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,350 కోట్లు కేటాయించింది. కుటుంబానికి రూ.3 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. వచ్చేఏడాదికి డబుల్ బెడ్రూమ్ పథకం కింద గృహాల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయనున్నట్లు ప్రభుత్వం శాసనసభకు వెల్లడించింది.

ప్రభుత్వం ఇంతవరకు 2.75 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయగా దాదాపు 1.37లక్షల గృహాల నిర్మాణం పూర్తయింది. మరో 53,984 ఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తికాగా మిగతావి నిర్మాణదశలో ఉన్నాయి. లబ్ధిదారుల వాటా లేకుండా ప్రభుత్వమే పూర్తి నిధులు వెచ్చించి చేస్తున్న నిర్మాణాలు వేగంగా పూర్తిచేసి అందించనున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈమేరకు లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించేందుకు సాంకేతిక సాయాన్ని తీసుకోనున్నామని, ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గృహనిర్మాణాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారు దరఖాస్తుదారుల్లో ఉంటే వారిని తొలగించి, ఏ పథకం కింద లబ్ధి పొందనివారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది.

సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి ప్రభుత్వం 2023-24లో 4 లక్షల మంది వరకు లబ్ధిదారులకు సాయం అందించనుంది. ఈమేరకు పట్టణ ప్రాంతాల్లో 2,21,800 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 1,78,200 మందికి ఆర్థికసాయం అందించడానికి నిర్ణయించింది. కరోనా తదితర కారణాలతో రెండేళ్లుగా గృహనిర్మాణాలు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి పీఎంజీఎస్వై గ్రామీణ, పట్టణ, డబుల్ బెడ్రూమ్, సొంత జాగాల్లో గృహాల పథకం కింద మొత్తం 5.35 లక్షల ఇళ్లకు లక్ష్యం పెట్టుకుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking