Take a fresh look at your lifestyle.

అభివృద్ధి జరగాలంటే.. డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే : కేంద్రమంత్రి కిషన్ రెడ్

0 16

అభివృద్ధి జరగాలంటే.. డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
నిర్దేశం, హైదరాబాద్ : అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గత ఐదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంబర్ పేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏం లేదు. అరాచకమైన అవినీతి పాలన, అక్రమంగా కేసులు పెట్టడంలో వారు బిజీగా ఉన్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. అంబర్ పేట ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 21 స్కూళ్లు కట్టించాను, ఒక బీసీ హాస్టల్, 5 సబ్స్టేషన్లు నిర్మించాం, మూడు లైబ్రరీ భవనాలు కట్టాం. వందకు పైగా కమ్యూనిటీ హాల్స్ నిర్మించామని అన్నారు. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లోని కాలనీలకు వరదనీటితో ఇబ్బందులు పడుతున్నా, అంబర్పేటలో అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ కు ఓటెందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్రూంలు ఇవ్వనందుకా, దళిత బంధు, గిరిజన బంధు అమలు చేయనందుకా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుకా, 25 వేల టీచర్ పోస్టులు ఎక్కడ పోయాయ్, ప్రైవేట్ హాస్పిటల్లో రూ.5 లక్షల ప్రయోజనం చేకూర్చే ఆయుష్మాన్ భారత్ అడ్డుకున్నందుకా, పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వనందుకు ఓటేయాలా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతం రావాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా బీజేపీ సర్కార్ రావాల్సిందే అన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే దున్నపోతులు తినేవాడు పోయి, ఏనుగులు తినేవాడు వస్తాడన్నారు. అంబర్ పేట నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణయాదవ్ ను గెలిపించాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరాడు.

Leave A Reply

Your email address will not be published.

Breaking