Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ని వింతలో..

0 11

అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ని వింతలో..
– బాల్కొండలో అత్తా – అల్లుడి మధ్య పోటీ
– నిజామాబాద్ రూరల్ లో తండ్రి – కొడుకుల నామినేషన్
నిర్దేశం, నిజామాబాద్ :
రాజకీయాలలో శాశ్వత శతృవులు ఉండరు.. శాశ్వత మితృలు ఉండరు అనేది సామెత. కానీ.. బాల్కొండ నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికలలో మేనత్త, అల్లుడు పోటీ చేయడమే ఇందుకు తాజా ఉదాహరణ. అధికార బీఆర్ ఎస్ నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ పోటీ చేస్తున్నారు. అయితే.. ఒకే కుటుంబంలో నుంచి ఇద్దరు పోటీ చేయడం చర్చానీయంశంగా మారింది.
అత్త – అల్లుడి మధ్య సునీల్ రెడ్డి పోటీ
బాల్కొండ నియోజక వర్గంలో రాజకీయాలు అసక్తిగా మారాయి. ఈ నియోజక వర్గంలో పోటీ చేసేది ముగ్గురు రెడ్డి సామాజిక వర్గంకు చెందిన వారే. అయితే.. బీజేపీ నుంచి ఏలేటి అన్నపూర్ణమ్మ, బీఆర్ ఎస్ నుంచి ప్రశాంత్ రెడ్డి అత్త – అల్లుడు పోటీ చేయగా వీరి మధ్య కాంగ్రెస్ అభ్యర్థిగా సునీల్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
తండ్రి కొడుకులు నామినేషన్..
నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం నుంచి తండ్రి, కొడుకులు అసెంబ్లీకి నామినేషన్ వేసారు. బీఆర్ ఎస్ అభ్యర్థిగా తండ్రి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ వేసారు. అతని కుమారుడు బాజిరెడ్డి జగన్ కూడా అదే నియోజక వర్గం నుంచి ఇంటిపెండెంట్ అభ్యర్థిగా నామినేష్ దాఖలు చేశారు. అయితే.. ముందు జాగ్రత్తగా నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. జగన్ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారన్న మాట..
హ్యాట్రిక్ కోసం మంత్రి..
బాల్కొండ నియోజక వర్గం నుంచి ఇప్పటికే రెండు మార్లు గెలిచిన ప్రశాంత్ రెడ్డి గెలుపొందారు. మూడవ సారి ఎమ్మెల్యేగా గెలువడానికి పోటీ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అన్నపూర్ణమ్మ తాను ఎలాగైన గెలువాలనుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి హవాలో ఎమ్మెల్యేగా గెలువడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముగ్గురు ఎవరికి వారే గెలుపు నాదే అనే ధీమాలో ఉన్నారు.. ఇంతకు ఈ ముగ్గురిలో ఏ రెడ్డి గెలుస్తారో ఎదురు చూడాల్సిందే…?

Leave A Reply

Your email address will not be published.

Breaking