Take a fresh look at your lifestyle.

అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై జిఎస్‌టి కౌన్సిల్‌

0 50

అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై

జిఎస్‌టి కౌన్సిల్‌ ఏకాభిప్రాయం

న్యూఢిల్లీ: అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై జిఎస్‌టి కౌన్సిల్‌ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. శనివారం నాడిక్కడ విజ్ఞాన భవన్‌లో ఆమె అధ్యక్షతన 49వ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిఎస్‌టి అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు, పాన్‌ మసాలా, గుట్కా వ్యాపారంలో పన్ను ఎగవేతలను అరికట్టడానికి యంత్రాంగం, ఇతర అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జిఎస్‌టి అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు, పాన్‌ మసాలా, గుట్కా వ్యాపారంలో పన్ను ఎగవేతలను అరికట్టడానికి యంత్రాంగం, ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం నేషనల్‌ మీడియా సెంటర్‌ (ఎన్‌ఎంసి)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking