Take a fresh look at your lifestyle.

జిఎస్ఎల్ వీ – ఎఫ్12 రాకెట్ ప్రయోగం విజయవంతం

0 12

రాకెట్ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట, మే 29 :  జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం విజయవంతం అయ్యింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్‌ను ప్రయోగించింది. సోమవారం శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నావిగేషన్‌ శాటిలైట్‌ ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 12 (GSLV-F12) వాహనకౌక ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని ఉదయం 10:42 గంటలకు నింగిలోకి తీసుకెళ్లింది.

ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్‌ వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. నావిగేషన్‌ సేవల కోసం గతంలో పంపిన వాటిలో నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసిందని, వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ శనివారమే వెల్లడించారు.

కాగా, జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 పొడవు 51.7 మీటర్లు. బరువు 420 టన్నులు. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్‌ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌-01 మొదటిది. 2,232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు. ఈ ఉపగ్రహం భారత్‌ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్‌ టైమ్‌ పొజిషనింగ్‌ సేవలను అందిస్తుంది…

Leave A Reply

Your email address will not be published.

Breaking