Take a fresh look at your lifestyle.

అనాధల బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ద్యేయం : మంత్రి

0 14

అనాధల బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ద్యేయం

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో విశాఖపట్నంలోని SOS చిల్డ్రన్స్ విలేజ్ సందర్శించిన. మంత్రి, అధికారుల

అనాధల విద్య, భద్రతతో పాటు బంగారు భవిష్యత్ పై అధ్యయనం పై సబ్ కమిటీ ఏర్పాటు

విద్యా, యువత నైపుణ్య శిక్షణ, కుటుంబ సంరక్షణ పలు అంశాలపై సమీక్ష

హైదరాబాద్, ఆగష్టు 12 : అనాధల బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశుసంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు శనివారం రోజు విశాఖపట్నంలోని భీమునిపట్నం వద్ద గల SOS విలేజ్ ను, సీఎంవో ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హొలీ కేరి, హానుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జీహెచ్‌ఎంసీకి అడిషనల్‌ కమిషనర్‌ స్నేహశబరీష్‌ ఇతర అధికారులతో కలసి మంత్రి సత్యవతి రాథోడ్ గారు సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ అనాధలను రాష్ట్ర ప్రభుత్వం హక్కున చేర్చుకుంటుందని, మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వారిని అనాధలుగా కాకుండా రాష్ట్ర పిల్లలుగా భావిస్తామని చెప్పారు. వారి బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గౌరవ సీఎం కేసీఆర్‌ గారు వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. వారు భవిష్యత్ లో స్థిర పడే విధంగా, వారు ఓ కుటుంబాన్ని ఏర్పరచుకునే వరకు వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి భవిష్యత్‌ అంధకారంగా మారకుండా
విద్యా, ఉద్యోగం, ఉపాధి, కుటుంబం ఇలా వారు అన్నివిధాలుగా స్థిరపడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. విశాఖలో పట్నంలోని SOS చిల్డ్రన్స్ విలేజ్ లో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సమస్యలను తెలుసుకునేందుకు సబ్‌కమిటీ సభ్యులు సమావేశమ‌య్యారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking