Take a fresh look at your lifestyle.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

0 36

పర్యావరణ పరిరక్షణ

ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

– ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యం. వినయ్ నాయక్

విద్యార్థి దశ నుండి మొక్కలు నాటి సంరక్షించాలని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత వన క్షేమమే మన క్షేమమని, పుడమికి అందం వృక్షాలని సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యం. వినయ్ నాయక్ అన్నారు. సత్యశోధక్ నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్ ఆధ్వర్యంలో ‘పర్యావరణం – పచ్చదనం అడవుల సంరక్షణ’ పై ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య అధ్యక్షతన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యం. వినయ్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

వినయ్ నాయక్ మాట్లాడుతూ జీవకోటి మనుగడకు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ప్రధానమని, అడవులను సహాజవనరులను కాపాడి జీవావరణం, వాతవరణ సమతుల్యతను పొందించాలన్నారు. ప్రకృతి సిద్ధంగా లబించే సహజ వనరులను కపాడాలని పర్యావరణానికి హనికల్గించే కారకాలను నివారించాలని, వనరులను, వనాలను వృధా చేయకుండా విజ్ఞతతో, పరిమితంగా వాడాలన్నారు.

విద్యార్థులు నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్లో భాగస్వాములు కావడం అభినందనీయమని ప్రతి విద్యార్థి తమ జన్మదినాన్ని పురస్కరించుకొని విధిగా మొక్కను నాటి సంరక్షించాలని, సమాజంలో పరిణామాలకు విద్యార్థులే అసలైన మాధ్యమాలన్నారు.


‘మొక్కల అవశ్యకత పర్యావరణ సంరక్షణ’ పై యన్. జి. సి. ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించనైనది. తదనంతరం పాఠశాల ప్రాగంణంలో విద్యార్థులు మరియు సిబ్బందితో కలిసి మొక్కలను నాటడమైనది. వివిధ అంశాలలో ప్రత్యేక కనబర్చిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేయనైనది. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఒ. యస్. గంగారం, అటవిశాఖ, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking