Take a fresh look at your lifestyle.

గీ పెళ్లి ఆదర్శం..

0 17

గీ పెళ్లి ఆదర్శం..

పెళ్లి.. జీవితంలో మధురమైన జ్ఞాపకాలు. పెళ్లితో ఇద్దరు భాగస్వాముల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. కానీ.. పెళ్లి తంతు పేరుతో వృధా ఖర్చు చేసేవారే ఎక్కువ. పేదోళ్లు సైతం తమ స్థాయికి మించి సమాజంలో సోషల్ స్టెటాస్ చూయించడానికి అప్పులు చేసి మరి పెళ్లిని ఘనంగా చేసుకుంటారు.

కానీ.. గీ పెళ్లి మాత్రం రొటిన్ గా భిన్నంగా చేసుకున్నారు.
ఇగో.. మూఢనమ్మకాలను, మూఢ విశ్వాసలాలను అంతం మొందించే విజ్ఞాన దర్శినిలో వాలంటీర్ లుగా పని చేసే యువరాణి – శశాంక్ లు సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. ఆ నవ దంపతులది కులాలు వేరు. అయినా.. పెద్దల సమక్షలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లిలో పురోహితుడు లేడు.. పాస్టర్ లేడు.. ముల్లాలేడు.. తరతరాలుగా వస్తున్న పెళ్లి ఆచారాలు లేవు.

చాలా సింపుల్ గా విజ్ఞానదర్శిని కుటుంబ సభ్యులు, పెద్దలు, బందు మిత్రుల సమక్షంలో సహచర్య ప్రకటన చదివి నిరాడంబరంగా ఉత్సాహభరితంగా, ఉత్తేజపూరితంగా సావిత్రి భాయి, జ్యోతిరావు పులే ఫోటోల సాక్షిగా పెళ్లి చేసుకుని యువరాణి – శశాంక్ దంపతులయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి జంటకు పూల మొక్కను బహుమతిగా అంద చేశారు విజ్ఞానదర్శిని వ్యవస్థాపకులు రమేష్.

ఈ పెళ్లి తంతులో విజ్ఞానదర్శిని కుటుంబ సభ్యులు శోభరాణి, ఆదం రాజు, బాల నారాయణ, , విప్లవ కుమార్, విజయ్ ఐతా, మహ్మద్అలీ, రాజు, ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
పెళ్లి పేరుతో కోట్లు ఖర్చు పెడుతున్న నేటి కాలంలో సింపుల్ గా సహచర్య ప్రకటన చదివి దంపతులైన యువరాణి – శశాంక్ లకు పెళ్లి శుభాకాంక్షలు చెబుదాం..
– రమేష్, వ్యవస్థాపకులు, విజ్ఞాన దర్శిని

Leave A Reply

Your email address will not be published.

Breaking