Take a fresh look at your lifestyle.

వరంగల్ లో హైటెక్ వైద్యుల ముఠా గుట్టు రట్టు

0 13

వరంగల్ లో హైటెక్ వైద్యుల ముఠా గుట్టు రట్టు

వరంగల్, మే 29 : వరంగల్ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు, ఆబార్షన్లు చేస్తున్న హైటెక్ వైద్యుల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసు అధికారులు. వరంగల్ లోటస్ ఆస్పత్రి, గాయత్రి ఆస్పత్రి.. నర్సంపేటలో బాలాజీ ఆస్పత్రిలో అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు స్టింగ్ ఆపరేషన్‌తో పక్కా ప్లాన్ వేసుకొని రంగంలోకి దిగారు. ఈ మేరకు ఓ మహిళ(లేడీ ఎస్సై)కు ఆబార్షన్ చేయాలంటూ వెళ్లి వైద్యుల ముఠాను సాక్ష్యధారాలతో సహా పట్టుకున్నారు పోలీసులు.

ఈ క్రమంలో ఇప్పవరకు మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు గైనకాలజిస్ట్ డాక్టర్లు, ల్యాబ్స్ నిర్వాహకులు ఉన్నట్లుగా గుర్తించారు. వీరే కాక స్థానికంగా 100 మందికి పైగా RMP డాక్టర్లు కూడా ఈ రాకెట్‌లో ఉన్నట్లు వారు గుర్తించారు.తమ వద్దకు వచ్చిన గర్భిణీలకు లింగ నిర్ధారణ పరిక్షలు జరిపి.. కడుపులో అమ్మాయి అని తేలితే అబార్షన్లు చేస్తున్నారని, ఒక్కొక్కరి నుంచి 30 వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలింది. అబార్షన్ కోసం వచ్చినవారు పెళ్లికాని వారైతే లక్షల్లో వసూళ్లు చేస్తున్నారని, అనుమతి లేని ఆస్పత్రుల్లోనూ అబార్షన్లు చేస్తున్నారని స్టింగ్ ఆపరేషన్ కండక్ట్ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు.

గర్భస్థ పిండం లింగ నిర్ధారణ పరీక్షలు ఎవరు చేసినా చట్టరీత్యా చర్య తీసుకుంటామని, కేసు నమోదు చేస్తామని పోలీసు హెచ్చరిస్తున్నారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లింగ నిర్ధారణకు పాల్పడుతూ పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకొని.. అడపిల్ల పుడుతున్నట్లు తెలిస్తే గర్భస్రావానికి పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయని.. ఈక్రమంలోనే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్స్, జిల్లా వైద్య విభాగాలతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టామని సీపీ తెలిపారు.

పోలీసులు ఆపరేషన్ దేశాయ్ నిర్వహించి అక్రమంగా లింగనిర్ధారణ పాల్పడుతున్నట్లుగా గుర్తించారన్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లోని ప్రధాన నిందితుడైన వేముల ప్రవీణ్ గతలో స్కానింగ్ కేంద్రంలో టెక్నిషియన్ గా పనిచేశాడని.. ఆ సమయంలోనే ఆక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసినందుకు గాను పోలీసులు అతడిని అరెస్ట్ చేశారన్నారు. అయినా అతడు బుద్ధి మార్చుకోకుండా మరోసారి అక్రమ మార్గంలో డబ్బు సంపాధించేందుకు ప్లాన్ వేశాడన్నారు.

ఇందుకోసం తన భార్య సంధ్యారాణితో కలిసి కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని గర్భవతులకు లింగనిర్ధారణ చేసేందుకు కొద్ది సిబ్బందితో పోర్టబుల్ స్కానర్ల సహాయంతో స్కానింగ్ కేంద్రాన్ని రహస్యంగా నిర్వహిస్తున్నారు. నిందితుడు వేముల ప్రవీణ్ ఆర్ఎంపీలు, పీఆర్ఓలు, ఆసుపత్రి మేనేజ్ మెంట్ సిబ్బంది, వైద్యులతో కలిసి ఓ నెట్ వర్స్ గా మారి అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారని సీపీ ఏవీ రంగనాథ్ వివరించారు. ఆడబిడ్డ పుడుతుందని తెలిస్తే గర్భస్రావం చేయించుకోవాలనుకునే వాళ్లను హన్మకొండలోని లోటస్ హస్పటల్, గాయత్రి హస్పటల్, నెక్కొండలోని ఉపేందర్ ( పార్థు)హాస్పటల్, నర్సంపేట్ లోని బాలాజీ మల్టీ స్పెషాల్టీ హస్పటళ్లలో గర్భవతులకు సంబంధిత ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది అక్రమంగా గర్భస్రావాలను చేసేవారు.

ఇందుకోసం బాధితుల నుండి ఫీజుల రూపంలో వసూళ్లు చేసిన డబ్బులను ఈ ముఠా సభ్యులు కమీషన్ల రూపంలో వాటాలు పంచుకునేవారు. ఒక్కోక్క గర్భస్రావానికి 20 వేల నుంచి 30వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసేవారు. ఇప్పటి వరకు ఈ ముఠా వందకు పైగా గర్భస్రావాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారని వరంగల్ సీపీ వెల్లడించారు.

ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ పుష్ప, టాస్క్ ఫోర్స్ వీసీపీ జితేందర్ రెడ్డి, ఇన్స్ స్పెక్టర్లు సుజాత, శ్రీనివాస్ రావు, జనార్ధన్ రెడ్డి, వినయ్ కుమార్, ఎస్.ఐలు ఫసీయుద్దీన్, మల్లేశం, శరత్ కుమార్, ఏ.ఏ.ఓ సల్మాన్ప, ఏ.హెచ్.టి.యు సిబ్బంది ఎ.ఎస్.ఐ భాగ్యలక్ష్మి, హెడా రానిస్టేబుల్ సమీయుద్దీన్, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, సైబర్ క్రైం సిబ్బంది కిషోర్ కుమార్, రాజు, అంజనేయులు, రజియా సుల్తానా, టాస్క్ఫోర్స్ సిబ్బంది. శ్యాంసుందర్, సురేష్, ప్రభాకర్, కమల వనంత, హోంగార్డ్ రవీందర్, చైల్డ్ కోఆర్టినేటర్లు కృష్ణమూర్తి, కృతిలను సీపీ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking