Take a fresh look at your lifestyle.

ఆపదలో ఆదుకుంటున్న మీసాల పౌండేషన్

0 51

ఆపదలో ఆదుకుంటున్న మీసాల పౌండేషన్

  • పేదలకు ఉచితంగా పారా మెడిక్స్ విద్యను
  • ఆరోగ్యంపై అవగాహన శిబిరాలు..
  • సమస్యల పరిష్కారం కోసం దీక్ష

కళ్ల ముందు కష్టాలు పడుతున్న పట్టించుకోకుండా పోయేవాళ్లే ఎక్కువ. ఆపదలో ఉన్న వారు ఆదుకొమ్మని కోరినా నన్ను కాదు అనుకుంటూ వెళ్లే వారుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు కష్టాలలో ఉన్నోళ్లను ఆదుకుంటారు. ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టి ఆకలి తీరుస్తారు. సేవే ధ్యేయంగా తమ జీవితాన్ని మలుచుకుంటారు. ఇగో.. రెండో కోవకు చెందిన యువకుడే మీసాల శ్రీనివాస్ రావు.

పుట్టుకతోనే పువ్వు పరిమళించును అన్నట్లుగా విద్యార్థి దశ నుంచే పేదలకు సహాయం చేయాలని సంకల్పం తీసుకున్నాడు శ్రీనివాస్ రావు. ఆర్థికంగా డబ్బులు లేక పోయినా ఉన్న దాంట్లో సహాయం చేయాలనే మెంటాల్టీ శ్రీనివాస్ రావుది. ఇంటి పేరుతో ‘మీసాల ఫౌండేషన్’ ఏర్పాటు చేసి ఆపదలో ఉన్నోళ్లను ఆదుకుంటున్నారు అతను. ‘దేశం నాకు ఏమి ఇచ్చింది అనేది కాదు.. నేను దేశానికి ఏమి ఇచ్చాను..’ అనే సూక్తితో ప్రజా సేవలో ముందుకు వెళుతున్న మీసాల శ్రీనివాస్ ది నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామం.

అన్నం సంపాదించడం ముఖ్యం..

ఆకలి అవుతుంటే అన్నం పెట్టడం కాదు.. ఆ అన్నం ఎలా సంపాదించుకోవాలో నేర్పించాలనే సూక్తిని మీసాల శ్రీనివాస్ రావు పాటిస్తాడు. మానవ సేవయే మాధవ సేవ అనే మదర్ థెరిస్సాను స్పూర్తిగా తీసుకున్నాడు అతను. ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులే మిన్న అనే సూక్తిని నమ్మిన అతను ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ లో 2002లో సిద్ధార్థ పారా మెడికల్ విద్యా సంస్థను ప్రారభించారు మీసాల శ్రీనివాస్ రావు. రొటిన్ ఎడ్యుకేషన్ కు భిన్నంగా నిజామాబాద్ జిల్లా వాసులకు పారా మెడిక్స్ విద్యను పరిచయం చేశారు.

ఆ విద్యా సంస్థ అంచెలంచెలుగా విస్తరించింది. హెల్త్ విద్యతో పాటు ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరిస్తూ వారిని చైతన్య వంతులను తన బాధ్యతగా ఫీలయ్యారు. ‘‘విద్యలేని వాడు వింత పశువు..’’ అని ప్రాథమిక పాఠశాలలో చదువేటప్పుడు జెండా వందనం రోజు ఇచ్చిన నినాదం మీసాల శ్రీనివాస్ రావుకు ఎప్పుడు గుర్తుకు వస్తోంది. అందుకే విద్యను దానం చేస్తే పేదోడు కూడా తలెత్తుకుని బతుకడం గురించి ఆలోచిస్తాడని నమ్ముతాడు అతను.

జిల్లాలో తొలి మెడికల్ విద్యా సంస్థ

జిల్లా కేంద్రం లోని కంఠేశ్వర్ 2002లో సిద్ధార్థ పారా మెడికల్ విద్యా సంస్థను ప్రారంభించి జిల్లావాసులకు పారా మెడిక్స్ విద్యను పరిచయం చేశారు. అది శాఖోపశాఖ లుగా విస్తరించిన తరుణంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్యారంగంలో ఉండి ఎంతో మందికి ఉపాధికి దారి చూపించారు. మీసాల ఫౌండేషన్ ద్వారా సేవా రంగంలో విశిష్ట మైన సేవలందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

సామాజిక రుగ్మాతలపై…

కేవలం సేవా కార్యక్రమాలతో సరిపెట్టకుండా సామాజిక, ఆర్ధిక పరిస్థితులలో తలెత్తే రుగ్మతులపై తనదైన శైలిలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు. పల్స్ పోలియో, ఎయిడ్స్ లాంటి రోగాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. జాతీయ పండుగలైన గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలను, స్వామి వివేకానంద జయంతి. వివిధ పండుగల సందర్భంగా విరివిగా స్వచ్ఛంద సేవా కార్య క్రమాలను చేపడుతున్నారు. జిల్లాలో నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ లందిస్తున్న అధికారులను గుర్తించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారిని సన్మానిస్తూ అవార్డులు అంద చేస్తున్నారు.
Meesala Srinivas Rao | the Leaders Page | Founder and Chairman of the MSR Foundation

సమస్యల పరిష్కారం కోసం..

నిజామాబాద్  నగరంలోని కంఠేశ్వర్ రైల్వే కమాన్ రోడ్డు ఇరుకుగా ఉండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించారు మీసాల శ్రీనివాస్ రావు. ఆ రైల్వే కమాన్ వెడల్పు చేయాలని మీసాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీక్ష చేసి దానిని సాధించిన ఘనత శ్రీనివాస్ రావుకు దక్కుతుంది.  సేవా కార్యక్రమాలతో  పాటు ప్రమాదాలు, అనుకోని సంఘటనలు, విపత్తుల్లో బాధితులను ఆదుకోవడం అతని సేవా నిరతికి నిదర్శనం.

లయన్స్ క్లబ్ ఆఫ్ డైమాండ్, ఇతర స్వచ్ఛంద సంస్థల్లోనూ సభ్యత్వం ఉంది. మీసాల ఫౌండేషన్ చైర్మన్ గానే కాకుండా, తెలంగాణ పారా మెడికల్ విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడిగా, నెట్బాల్ అసోసియే షన్ ఉపాధ్యక్షుడిగా, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేపీ క్రీయశీల రాజకీయాలలో పాల్గొంటున్న మీసాల శ్రీనివాస్ రావు అర్ధాంగి నవిత నిజామాబాద్ నగర కార్పొరేటర్ గా ప్రజలకు సేవలందిస్తున్నారు.

సేవలో ఎంతో సంతోషం..

ఆపదలో ఉన్న ప్రజలకు సేవలందిస్తే తనకు ఎంతో సంతోషంగా ఉంటుందంటారు మీసాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మీసాల శ్రీనివాస్ రావు. ప్రజలకు సేవలందించాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేశానంటారు ఆయన. దశాబ్ద కాలంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం సంతృ ప్తినిచ్చిందన్నారు శ్రీనివాస్ రావు. తమ సేవలతో ప్రజలు లబ్ధిపొందితేనే మాకు తృప్తి. జిల్లావ్యాప్తంగా సామా జిక సేవా కార్యక్రమాలు విస్తరిస్తున్నాం అంటున్నారు శ్రీనివాస్ రావు.

  • యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking