Take a fresh look at your lifestyle.

ఆయుర్వేద వైద్యం పేరిట మోసం

0 18

ఆయుర్వేద వైద్యం పేరిట మోసం
నిర్దేశం, హైదరాబాద్ :
ఆంగ్ల వైద్యంతో నయం కానిది.. ఆయుర్వేద వైద్యం తో నయం చేస్తామంటూ నమ్మించి మోసం చేసి రూ.3.50 లక్షలు వసూలు చేసి పరార య్యాడు మోసగాడు. మధురానగర్ పోలీ సుల కథనం ప్రకారం.. మోతీనగర్ అవంతీ నగర్ లో నివాసముండే వాసా ఛాయాదేవి తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతుండేవారు. 20 ఏళ్ల కిందట జరిగిన ఓ ప్రమాదంలో ఆమె వెన్నుముకకు గాయమైంది. అప్పటి నుంచి ఆమె లేచి నిలబడలేని పరిస్థితి. రెండేళ్ల కిందట ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. అతడు ఆయుర్వేద వైద్యు డిగా పరిచయం చేసుకొని.. పేరు ఆనంద్ అని చెప్పాడు. వెంగళరావునగర్లోని ధన్వంతరి ఆయుర్వేద సెంటర్ తనదేనని చెప్పాడు. ఆయుర్వేద వైద్య విధానంతో తిరిగి నడిచేలా చేస్తానని ఆమెను నమ్మించాడు. ఆయుర్వేద వైద్యానికి స్వర్ణభస్మం కావాల్సి ఉంటుందని, 3 తులాల బంగారం ఇవ్వాలని కోరారు. దీంతో ఆమె రూ.1.70 లక్షల చెక్ ఇచ్చింది. హిరాయుక్త రస్ ఔషధం తయారు చేయడా నికి డబ్బు కావాలంటూ.. పలు దఫాలుగా ఆమె వద్ద నుంచి మొత్తం రూ.3.50 లక్షలు వసూలు చేశాడు. అతడు ఇచ్చిన ఔషధాన్ని వాడిన తర్వాత కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. కాళ్ల నొప్పులు ఆమెకు అధికమ య్యాయి. కొద్ది రోజుల తర్వాత అతడి ఇల్లు ఖాళీ చేసి.. ధన్వంతరి ఆయుర్వేదిక్ సెంటర్ బోర్డ్ తిప్పేసి ఉడాయించాడు. చివరికి తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు మంగళవారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking