Take a fresh look at your lifestyle.

తెలంగాణలో మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం

0 166

తెలంగాణలో మళ్లీ టీడీపీకి

పూర్వ పూర్వ వైభవం కోసం చంద్రబాబు స్కెచ్!

హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ టీడీపీకి ఊపునివ్వడానికి చంద్రబాబు స్కెచ్ గీస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణలో పార్టీకి కీరోల్ పోషించిన వారందరినీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. మాజీ టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు మళ్లీ టీడీపీలోకి రావాలని నిర్ణయించుకున్నట్లుగా నిజామాబాద్లో పుకార్లుషికార్లు చేస్తున్నాయి. ఆయన అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు.

గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కవిత పరిస్థితి క్లిష్టంగా ఉందని గ్రహించిన కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆయన సినీయారిటీకి తగిన గౌరవం ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ లో ఆయన యాక్టివ్ గా కనిపించలేదు.తెలంగాణలో టీడీపీకి మళ్లీ ఊపిరి లూదాలని భావిస్తున్న చంద్రబాబు ఈ మేరకు ఒకనాడు టీడీపీలోని యాక్టివిస్టులు సీనియర్లను తట్టి లేపుతున్నారు.

టీడీపీ మొదట ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఊపిరిలూదింది. ఆ సభలో పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణలో విస్తరిస్తామని ప్రకటించారు.త్వరలోనే నిజామాబాద్ మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని వీడి వెళ్లినవంతా తిరిగిరావాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది.

రేవంత్ రెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ లో చేరారు. మిగతా వారు టీఆర్ఎస్ . బీజేపీలోకి వెళ్లిపోయారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం సభతో ఊపుతెచ్చారు. ఇప్పుడు నిజామాబాద్ లాంటి ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉండే చోట జెండా పాతాలని చూస్తున్నారు.నిజామాబాద్ లో చాలామంది టీడీపీ నాయకులు చంద్రబాబుకు టచ్ లో ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలో పార్టీకి మంచి క్యాడర్ ఉండడంతో ఆ జిల్లాలో కార్యక్రమాలు చేపట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ రూరల్ బాన్సువాడ బోధన్ నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. జనవరి చివరివారంలో బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చంద్రబాబుతోపాటు ముఖ్యమైన నాయకులు కొందరినీ ఆహ్వానించి వారి సమక్షంలో పార్టీలో చేరికలను ప్రోత్సహించాలనుకుంటున్నారు.

మరి టీడీపీ విస్తరణకు అడుగులు పడ్డట్టే కనిపిస్తోంది.త్వరలోనే టీడీపీలో తెలంగాణ విభాగంలో మండవకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని సమాచారం. మండవను తిరిగి యాక్టివ్ చేయించి ఆంధ్రా ప్రాబల్యం ఉన్న నిజామాబాద్ ప్రాంతాల్లో సీట్లు గెలవాలని.. ఓటు బ్యాంకును సమీకరించాలని చూస్తున్నారు. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking