Take a fresh look at your lifestyle.

ఫేక్ పాష్టర్ విజయబాబు నిర్వాకం

0 59

వెలుగు లోకి ఫేక్ పాష్టర్ విజయబాబు నిర్వాకం

ఒక్క పూట కడుపు నింపుకోవటానికి

తిండి కూడా లేక వీధిన పడ్డ కుటుంబం

తాడేపల్లి : అతనొక పేరుగల పాష్టర్. పోరంకి లో తన మందిరం లో ప్రార్ధన లు నిర్వహిస్తుంటాడు. తన ప్రసంగాలతో భక్తులను ఆర్షిస్తాడు. ఈ నేపథ్యంలో భారీగా సంఘస్తులను కూడగట్టాడు. పేరు, డబ్బు అతని మాయమాటల కు దాసోహమైపోయాయి. అంతలోనే తాడేపల్లి లో నివాసం ఉంటున్న పీటర్ పాల్ అనేవ్యక్తి పాష్టర్ తనను మోసం చేసాడంటూ సియం స్పందన లో ఫిర్యాదు చేసాడు. గత 7 సంవత్సరాలుగా దూరపు బంధుత్వాన్ని ఆసరాగా తీసుకుని తన ప్రార్ధన ద్వారా రాజధాని లో భూములు ప్లాట్లు అంటూ నీవు కొంత ఇస్తే దేవుడు నా ప్రార్థన ద్వారా నీకు పదిరెట్ల ఆధికంగా ఇస్తాడంటూ నమ్మబలికాడని పిర్యాదు.

ఆశపడ్డ పడ్డ పీటర్ పాల్ తన దగ్గర ఉన్న కొంతసొమ్ము తో ఇంటిలో ఉన్న బంగారం అమ్మి పాష్టర్ కు సేవ చేసేందుకు కారు కొని తనే డ్రైవర్ గా ఉండేదుకు కొంత జీతం కారు నెలవారీ కిస్తీలు పాష్టర్ కట్టే విధంగా ఒప్పందం కుదిరింది.

కొంతకాలం బాగానే ఉన్నా తరువాత పాష్టర్ నెలవారీ కిస్తీలు కట్టడం మానేశాడు. కారు పోయిం.ది అదేమని అడిగితే చందాలు రావటంలేదని ఆదాయం తక్కువగా ఉందని అన్నాడు.
ఇది చాలవన్నట్లు తనకు ఉన్న 9 సెంట్ల స్థలాన్ని తన మాయమాటలతో ఇంకొక పాష్టర్ తో నమ్మించి వేరే వారికి బలవంతంగా రాయించుకున్నారు. దీనితో రోడ్డన పడ్డపీటర్ పాల్ తాను మోసపోయానని తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. తనకుటుంబం పాష్టర్ వల్ల రోడ్డున పడిందని ఇంటి అద్దె కట్టలేక పూట గడవడం కష్టంగా ఉందని తన బిడ్డలతో రోడ్డున పడ్డామని బార్య శైలజ కన్నీటి పర్యంతమైయ్యారు. సం చేసిన పాష్టర్ ఉచ్చులో మరికొంత మంది బాధితులు ఉన్నారని ఇటువంటి దొంగ పాష్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking