Take a fresh look at your lifestyle.

పోలీస్ స్టేషన్ లలో మహిళా హెల్ప్ డెస్క్‌ ల ఏర్పాటు – డీజీపీ

0 46

రాష్ట్రంలోని అన్నిపోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌ ల ఏర్పాటు

– డీజీపీ అంజనీ కుమార్

హైదరాబాద్ :  రాష్ట్రంలో మహిళా భద్రతా విభాగం కార్యకలాపాలపై మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ శిఖాగోయెల్, డీఐజి సుమతిలతో డీజీపీ అంజనీ కుమార్ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతపై పలు వినూత్న పధకాలను అమలు చేస్తూ, మహిళలు & శిశు భద్రతలో తెలంగాణను అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా మార్చడంలో మహిళా భద్రతా విభాగం చేసిన కృషిని అంజనీ కుమార్ అభినందించారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను వెంటనే అరికట్టడానికి పోలీస్ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డీజీపీ చెప్పారు.

రాష్ట్రంలో ఇప్పటికే 750 పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లు (డబ్ల్యూహెచ్‌డీలు) పని చేస్తున్నాయని, మిగిలిన అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అంజనీ కుమార్ వెల్లడించారు. మహిళా భద్రతపై ఇప్పటికే సంస్థాగతంగా ఉన్న మెకానిజమ్‌లను ఒకే సాంకేతిక ప్లాట్‌ఫారమ్ కిందకి తీసుకు రావడం ద్వారా మరింత సమర్థవంతంగా మహిళలపై నేరాలకు అరికట్టవచ్చని సూచించారు. మహిళా భద్రతా విభాగానికి అందే ఫిర్యాదుల పరిష్కారంపై పిటీషనర్ల స్పందనను తెలుసుకోవడానికి స్వతంత్రంగా పనిచేసే 24×7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని డీజీపీ తెలిపారు.

ప్రస్తుతం 12 యూనిట్లలో భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని, మిగిలిన జిల్లాల్లో కూడా నిర్ణీత గడువులోగా వాటిని అందుబాటులోకి తెస్తామన్నారు. 25 ట్రై కమిషనరేట్ పరిమితుల్లో గృహ హింస బాధితులకు కౌన్సెలింగ్ సేవలను చేపట్టేందుకు మహిళా సాధికారత కేంద్రం అభివృద్ధి (CDEWs) త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. భరోసా ద్వారా లైంగిక నేరాల కేసుల విచారణను పర్యవేక్షించడం వల్ల 2022 సంవత్సరంలో 23 కేసుల్లో నేరారోపణలు నిర్ధారించడం జరిగిందని, ఇంకా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసులను క్రమపద్ధతి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించాలన్నారు.. 2022లో, షీ టీమ్‌లు 6157 ఫిర్యాదులను స్వీకరించగా, వాటిలో 521 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసాయని, రాష్ట్రంలో 13,471 అవగాహన శిబిరాలను షీ టీమ్స్ నిర్వహించాయని తెలిపారు. మహిళలు, పిల్లలపై నేరాల నివారణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, మహిళలు & పిల్లలపై నేరాల నివారణపై సమర్థవంతంగా పనిచేసే అధికారులను గుర్తించి రివార్డులు ఇవ్వాలని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking