Take a fresh look at your lifestyle.

నాలుగు డ‌బ్బులు, రెండు సీసాలకు లొంగి ఓటు వేయ్యద్దు

0 11

నాలుగు డ‌బ్బులు, రెండు సీసాలకు లొంగి ఓటు వేయ్యద్దు
– పాల‌కుర్తి ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం కేసీఆర్
నిర్దేశం, పాల‌కుర్తి :
మ‌నం వేసే ఓటు మ‌న రాష్ట్రం, నియోజ‌క‌వ‌ర్గం, కుటుంబం యొక్క భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యిస్తుంది. ఆల‌వోక‌గా, నాలుగు డ‌బ్బులు, రెండు సీసాలు ఇచ్చిండ‌ని ప్ర‌లోభాల‌కు గురై ఓటు వేయొద్దన్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో ప్ర‌జ‌లు కూర్చుని చ‌ర్చించి ఓట్లు వేసిన‌ప్పుడే ప్ర‌జ‌లు గెలుస్తారు. అప్పుడే నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం వ‌చ్చిన‌ట్లు అని కేసీఆర్ పేర్కొన్నారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.
దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు గ‌డుస్తుంది. కానీ ఈ దేశంలో ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌లో రావాల్సినంత ప‌రిణితి రాలేదు. ఎల‌క్ష‌న్లు అన‌గానే సీటీలు, డ‌ప్పులు, అబ‌ద్దాలు, అభాండాలు, ఆరోప‌ణ‌లు, గోల్ మాల్, పిచ్చి పిచ్చి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఎల‌క్ష‌న్లు చాలాసార్లు వ‌చ్చాయి. చాల మందిని గెలిపించారు. ఇక ఈ 30న ఓట్లు ప‌డుతాయి. 3న లెక్కిస్తారు. అక్క‌డికి క‌థ అయిపోత‌ది. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు పార్టీకి ఒక‌రు నిల‌బ‌డుతారు. త‌ప్ప‌కుండా మీరు నిల‌బ‌డ్డ వ్య‌క్తుల మంచి చెడ్డా, వాళ్ల ఆలోచ‌న‌, ఏం ప‌నులు చేస్తారు అని ఆలోచించాలన్నారు ఆయన. అభ్య‌ర్థుల గుణ‌గ‌ణాలు చూడాలి. వీట‌న్నింటి కంటే ముఖ్య‌మైంది ఒక‌టి ఉంట‌ది. ఓట్ల‌ కౌంటింగ్ కాగానే అయిపోదు. ఇక్క‌డ గెలిచే అభ్య‌ర్థి యొక్క రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంది. ఆ ప్ర‌భుత్వం మంచిదైతే వ‌చ్చే ఐదేండ్లు మంచి జ‌రుగుత‌ది. మంచి ప్ర‌భుత్వం ఏర్ప‌డక‌పోతే ఆగ‌మైపోతం అని కేసీఆర్ అన్నారు.

పార్టీల న‌డ‌వ‌డిక గురించి ఆలోచించాలి..
అభ్య‌ర్థుల గురించి మాత్ర‌మే కాదు.. వారి వెనుకున్న పార్టీల గురించి ఆలోచించాలి. న‌డ‌వ‌డిక చూడాలి. వారికి అధికారం ఇస్తే ఏం చేశారు..? ఏం చేస్తారు..? అనేది చూడాలి. బీఆర్ఎస్ మీ కండ్ల ముంద‌ర‌నే పుట్టిన పార్టీ. తెలంగాణ హ‌క్కులు, ప్ర‌జ‌ల‌ను కాపాడ‌డం కోసం పుట్టింది. కాంగ్రెస్, బీజేపీ చ‌రిత్ర మీకు తెలుసు. ఈ ప‌దేండ్లు బీఆర్ఎస్ ఏం చేసింది. గ‌తంలో అధికారంలో ఉండి 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింద‌నేది విచారించాలి అని కేసీఆర్ సూచించారు.

ల‌క్షా 30 వేల ఎక‌రాల‌కు సాగునీరు..
ప‌దేండ్ల నుంచి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉంది. ఈ ప‌దేండ్ల‌లో పాల‌కుర్తిలో ఎంతో మార్పు వ‌చ్చింది. పాల‌కుర్తి నుంచి వేలాది మంది వ‌ల‌స పోయారు. ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి వ‌చ్చి వ‌రినాట్లు వేస్తున్నారు. ఇవ‌న్నీ బేరీజు వేయాలి. కాంగ్రెస్ ఎందుకు ఈ ప‌ని చేయ‌లేదు. ఉద్య‌మ స‌మ‌యంలో చాలాసార్లు పాల‌కుర్తికి వ‌చ్చాను. నాడు ఎస్సారెస్సీ కాల్వ‌ల్లో గ‌డ్డి చెట్లు మొలిచి కూలిపోయి ఉండే. నీళ్లు వ‌స్తాయ‌నే ఆశ లేకుండే. దేవాదుల పూర్తి చేసి కాళేశ్వ‌రం క‌ట్టి నీల్లు తీసుకువ‌స్తే ఇవాళ ల‌క్షా 30 వేల ఎక‌రాల‌కు నీళ్లు పారుతున్నాయి. మంచిగా బ‌తుకుతున్నారు అని కేసీఆర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking