Take a fresh look at your lifestyle.

అయ్యప్ప స్వామి దేవుడి ప్రసాదం తినోద్దు

0 585

దేవుడి ప్రసాదం అంటే కళ్లకు అద్దుకుని మరి తింటాం. దేవుడి ప్రసాదమంటే దేవుడితో సమానం అనుకుంటాం… కానీ.. కేరళలోని అయ్యప్ప స్వామి వారి ప్రసాదం తినోద్దని కోర్టు స్వయంగా ఆదేశాలు జారీ చేసింది.

దేవుడి ప్రసాదం తింటే ఆనారోగ్యానికి గురవుతామని కోర్టు సెలవిస్తోంది.

కేరళ అయ్యప్ప స్వామి ప్రసాదం తాత్కాలికంగా నిలిపివేత..

ఇంతకు ఏమి జరిగిందంటే..

ట్రావెన్కోర్ దేవస్థానం ఆధ్వర్యంలో తయారవుతున్న అరవణం ప్రసాదంలో వాడుతున్న యాలకుల్లో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు గుర్తింపు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల రిపోర్టులో కీలక అంశాలు.

ప్రసాదంలో వాడిన యాలకుల్లో 14 రకాల హానికారక అవశేషాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.

కోర్టు ఆదేశాల మేరకు ప్రసాదం నిలిపివేత ఇప్పటికే పంపిణీకి సిద్ధంగా ఉన్న ఆరు లక్షల డబ్బాలను ధ్వంసం చేసేందుకు కోర్టు ఆదేశం.

రేపటి నుంచి యాలకులు లేని అరవనం ప్రసాదాన్ని పంపిణీ చేయాలని కోర్టు ఆదేశం.
రానున్న నాలుగైదు రోజుల్లో మకరజ్యోతి కి వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్రసాదం కొరత ఏర్పడే అవకాశం.

యుద్ధ ప్రాతిపదికన రేపటి నుంచి యాలకులు లేని ఆరవణం ప్రసాదాన్ని తయారుచేసి పంపిణీ చేసేందుకు సిద్ధమైన ట్రావెల్ కోర్ దేవస్థానం

Leave A Reply

Your email address will not be published.

Breaking