Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే కోనప్పతో కలిసి జిల్లా ఎస్పీ అక్రమ దందా

0 19

ఆంధ్రా కొనప్పను ఓడిస్తేనే సిర్పూర్ కు విముక్తి

:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీని బదిలీ చేస్తే తప్ప జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలు జరుగవని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.కాగజ్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు,మద్యం పంపిణీకి ఎమ్మెల్యే కోనేరు కొనప్పకు జిల్లా ఎస్పీ పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు.ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ల స్థానిక బీఎస్పీ నాయకులపై ఎస్పీ అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కోనప్పతో కలిసి జిల్లా ఎస్పీ బినామీ పేర్లతో అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు.

జిల్లా ఎస్పీని బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి  ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తక్షణమే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో డబ్బు,మద్యం పంపిణీకి జిల్లా ఎస్పీ పరోక్షంగా బీఆర్ఎస్ నేతలకు సహకరిస్తున్నారని అన్నారు. తక్షణమే ఎన్నికల సంఘం ఎస్పీని బదిలీ చేసి,ఎన్నికల పరిశీలకులుగా ఐపీఎస్,ఐఏఎస్ అధికారులను ప్రత్యేక పరిశీలకులను నియమించి,పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్యే కోనప్ప కుటుంబం ఆగడాలు,దౌర్జన్యాలు సిర్పూర్ ప్రాంతంలో ఆగాలంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి, బీఎస్పీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

ఆంధ్ర ఎమ్మెల్యే కోనప్ప తెలంగాణ బిడ్డలపై చేయని నేరానికి బీఎస్పీ నాయకులపై అక్రమంగా అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు
కోనప్ప అండతోనే నియోజకవర్గంలో అక్రమ వ్యాపారాలు,జూదం,నకిలీ విత్తనాలు,ఎరువుల దందా నడుస్తుందని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ముండా కొడుకులని సిర్పూర్ ప్రజలను అవమానించిన ఎమ్మెల్యే కోనప్పను వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్నారు.గతంలో జిల్లా ఎస్పీని ఖమ్మం కు బదిలీ చేసినా అడ్డుకున్నది కోనప్పేనన్నారు. బీఎస్పీని గెలిపిస్తే ఆక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసి,నకిలీ విత్తనాల బెడద మంచి రైతులకు విముక్తి కల్పిస్తామన్నారు.

ఈ మీడియా సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, అసెంబ్లీ అధ్యక్షులు డోకే రాజన్న,ముస్తఫీజ్ హుస్సేన్, తన్నీరు పోచం,షబ్బీర్ హుస్సేన్, సీతానగర్ ఎంపీటీసీ జామున మహేష్, నక్క మనోహర్, సిద్ధం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

19న బీఎస్పీలో భారీ చేరికలు

మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లెండగూరె శ్యామ్ రావు బీజేపికి రాజీనామా చేసి, 2000 మంది అనుచరులతో బీఎస్పీలో చేరనున్నారు. కన్నేపల్లి ఎంపిటిసి దుర్గం మోతీరాం కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీ తీర్థం పుచ్చుకోనున్నారు. కౌటాలలో గురువారం భారీ జన సమీకరణతో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking