Take a fresh look at your lifestyle.

పేదల గుడిసెలు కూల్చివేత అక్రమం

0 58

పేదల గుడిసెలు కూల్చివేత అక్రమం
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు

సైదాబాద్, లోకాయుక్త కాలనిలో ప్రబుత్వయేతర భూముల్లో ఐదు దశాబ్దాలుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదల గుడిసెలను రెవిన్యూ అధికారులు కూల్చడం అక్రమం అని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు మండిపడ్డారు.

ప్రభుత్వ భూములు అని రికార్డుల్లో లేనప్పుడు రెవిన్యూ అధికారులు గుడిసెలను ఎలా నేలమట్టం చేస్తారని అయన ప్రశ్నించారు.

రెవిన్యూ అధికారులు, భూకబ్జాదారులు కుమ్మక్కై రౌడీల్లా వ్యవహరిస్తూ కాలనీలలో ఉండే గుడిసె లనే టార్గెట్ చేస్తూ, పేదల బతుకులను రోడ్డుకీడుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహ, సిపిఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్. ఛాయాదేవి, బి. స్టాలిన్, కార్యవర్గసభ్యులు ఆర్. శంకర్ నాయక్ లతోకలసి కూనంనేని సాంబశివ రావు సైదాబాద్ ఎస్బిహెచ్ కాలనీ, ఏ-వన్ కమ్యూనిటీ హాల్ లో ఆశ్రయం పొందుతున్న సైదాబాద్, లోకాయుక్త కాలనిలో కూల్చివేసిన గుడిసెవాసులను పరామర్శించారు.

తెల్లవారుజామున దౌర్జన్యంగా గుడిసెలలోకి ప్రవేశించి మహిళలు బాలింతలని కూడా చూడకుండా గెంటేసి గుడిసెలను రెవిన్యూ అధికారులు కూల్చివేశారని, తమ గుడిసెలను తొలగిస్తే తాము ఎక్కడుండాలని బాధిత మహిళలు కన్నీరుపెట్టుకున్నారు.

లోకాయుక్త కాలనిలో గుడిసెలు కూల్చివేసిన స్థలంలోనే తిరిగి గుడిసెలు వేసుకోవాలని, బాధితులకు సిపిఐ అండగా ఉంటుందని అయన భరోసా ఇచ్చారు. ఐదు దశాబ్దాలుగా గుడిసెలు వేసుకొని లోకాయుక్త కాలనిలో జీవిస్తున్న పేదలకు ఇండ్ల పట్టాలు లేదా అక్కడే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కూనంనేని సాంబశివ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఐ.ఎస్ సడన్ డివిజన్ కార్యదర్శి షేక్ మహమూద్, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గసభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్, సమితి సభ్యులు ఎస్. ఏ. మన్నన్, అమీనా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking