Take a fresh look at your lifestyle.

దళిత వర్గీకరణ…?

0 16

దళిత వర్గీకరణ…?
‘బలగం’ సినిమాలో నల్లి బొక్క విషయంలో జరిగిన అవమానానికి వాదించుకొని, తిట్టుకొని, బాధపడి ఒక కుటుంబం దశాబ్దాల పాటు విడిపోయినట్టు ఎస్సీ వర్గీకరణ అంశం మారింది. దళితుల మద్య ఐక్యత కు పెను ముప్పులా అయ్యింది. మారిన ఆర్థిక విధానాల వల్ల సాంకేతిక ఆభివృద్ది వల్ల విద్య, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో చాలా తేడాలు వచ్చాయి. ఒకప్పుడు బ్లాక్ & వైట్ టి.వి ఉంటే చాలా గొప్ప. ఇప్పుడు అది అవుట్ డేటెడ్.టి.డి.పి, కాంగ్రెసు, బీజేపీ, టి.ఆర్.ఎస్, విప్లవ సంఘాలు, కోదండరాం వంటి అనేక పార్టీలు రాత పూర్వకంగా మద్దతు ఇచ్చి ఆచరణలో చెయ్యి ఇచ్చినవే. వర్గీకరణ ఉద్యమంలో 23 మంది మరణించారు. 23000 కేసులు నమోదయ్యాయి. లక్ష్యం పెద్దది అయినప్పుడు ఆ లక్ష్య సాధనకు ఆటంకంగా మారిన చిన్న చిన్న విషయాలలో జరిగిన న్యాయ, అన్యాయంల విషయంలో రాజి పడినా.. ఓడినా తప్పు లేదు. మనం ఏ అంశాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాం అనేదే మన జీవిత ప్రయాణాన్ని గమ్యాన్ని డిజైడ్ చేస్తుంది.
– యెర్ర దయానందం

Leave A Reply

Your email address will not be published.

Breaking