Take a fresh look at your lifestyle.

అక్రమార్జనే నేటి పాలకుల ధ్యేయం

0 17

అక్రమార్జనే నేటి పాలకుల ధ్యేయం

పొలిటికల్ లీడర్.. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోచుకునే పగటి దొంగలు.. ప్రజా సేవ పేరుతో ప్రజలను నిలువున మోసం చేసి కోట్లు సంపాదించే దుర్మార్గులు.. ఎమ్మెల్యేగా.. ఎంపీగా గెలిచిన తరువాత నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తామని దేవుడి మీద ప్రమాణం చేస్తారు. అయినా.. ఆ ప్రమాణం పక్కన పెట్టి నేటి పాలకులు అక్రమంగా ఆస్థులు సంపాదించడం ధ్యేయంగా దోచుకుంటున్నారు. రాబోయే పది తరాలకు సరిపడు సంపాదన దోచి పెడుతున్నారు. ఇగో.. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఈ కింది కథ చదివితే నేటి దొంగ పాలకుల గురించి తెలుస్తోంది.

నిస్వార్థ సేవకు సెల్యూట్

“నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?” తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన !

ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో !

కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి
టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు !

అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని !

సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు !

ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ ఐదు రూపాయలు !

చెన్నై లో క్షణం తీరికలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థత గా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు !

లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో ” నాన్న గారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు సర్దుతారా..” అనంటంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటెంబట క్షణ కాలం మాట రాలేదు !

వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్భం మీద ఆపుకుంటూ జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి ఆయన చేతిలో పెట్టాడు !

దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ?

ముఖ్యమంత్రి పదవి అంటే తర తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా?

అంటే చూడలేమనే సమాధానం వస్తుంది !

ఆ తరం వేరు
నేటి తరం వేరు !

ఆనాటి రాజకీయాలు వేరు
ఈనాటి అరాచకీయాలు వేరు !

                                  – సోషల్ మీడియా సౌజన్యంతో..

Leave A Reply

Your email address will not be published.

Breaking