Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న కాంగ్రెస్ అభ్యర్థులు..

0 17

కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి

తప్పు సీనియర్లది.. నష్టం పార్టీకి..

నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో కాంగ్రెస్ రాజకీయాలు అసక్తిగా మారాయి. సీనియర్ లీడర్లు చేస్తున్న తప్పుకు కాంగ్రెస్ పార్టీ నష్ట పోవాల్సి వస్తోందనే టాక్ వినిపిస్తోంది. ప్రజలలో గల ఓటు బ్యాంక్ ను అనుకూలంగా మలుసుకోవడంలో విఫలం కావడానికి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ లీడర్ల మధ్య ఐక్యత లేక పోవడమే. గత పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసిన మాజీ ఎంపీ మదుయాష్కి గౌడ్ వ్యవహరించిన తీరు బీజేపీ అభ్యర్థి అరవింద్ కు కలిసి వచ్చింది. కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలుస్తుందని భావించిన మధుయాష్కి గౌడ్ ఎన్నికలో నామ మాత్రంగా ఉండి పరోక్షంగా బీజేపీ గెలుపుకు సహాకరించాడు.

కాంగ్రెస్ పార్టీ పరువు తీసిన యాష్కి గౌడ్

నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ దే.. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో నాయకుల తప్పిదం వల్ల పరువు పోగోట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. పొలిటికల్ గా చేసిన తప్పులను ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. కానీ.. పార్లమెంట్ ఎన్నికలలో గెలుపు కోసం శాయశక్తుల కృషి చేయాల్సిన మధుయాష్కిగౌడ్ అర్ధంతరంగా చేతులు ఎత్తెసారనేది  బహిరంగ రహస్యం. అయినా అతనికి జాతీయ స్థాయిలో పార్టీ పదవి ఇచ్చి అధిష్టాన వర్గం గౌర వించడం కొస మెరుపు.

2019 పార్లమెంట్ నియోజక వర్గ ఎన్నికలలో..

గత పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల ఓట్ల శాతంను పరిశీలిస్తే బీజేపీ – టీఆర్ ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ జరిగింది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 4 లక్షల 80 వేల 584 ఓట్లు సాధించి 70 వేల 875 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత 4 లక్షల తొమ్మిది వేల709 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిసింది. అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ గెలుపు కోసం ప్రయత్నాలు చేయక పోవడం వల్ల 69 వేల 240 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిసిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో అతి తక్కువ ఓట్లు నమోదు కావడంతో పరువు పోయినట్లయింది.

రాబోయే అసెంభ్లీకి అభ్యర్థులు ఎవరు..?

నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తు పార్టీ ఉనికిని కాపాడుతూ వచ్చారు. అయితే.. నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో ఆర్మూర్, జగిత్యాల్, కోరుట్ల, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజక వర్గాలున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత ఈ ప్రాంతాలలో బీఆర్ ఎస్ ప్రభాల్యం పెరిగింది. అయితే.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనుకూల వాతవరణం కనిపించడంతో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజక వర్గాల నుంచి బీసీలకు సీట్లు కెటాయించాలని అధిష్టాన వర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది.  జగిత్యాల్ నుంచి జీవన్ రెడ్డి (రెడ్డి), కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగ్ రావు (వెలమ), బాల్కొండ నుంచి సునీల్ రెడ్డి (రెడ్డి), నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపాత్ రెడ్డి లేదా నర్సారెడ్డి (రెడ్డి), నిజామాబాద్ అర్బన్ నుంచి మహేశ్ కుమార్ గౌడ్ లేదా దర్మపురి సంజయ్ (బీసీ), బోధన్ నుంచి సుధర్శన్ రెడ్డి లేదా కెప్టెన్ కరుణకర్ రెడ్డి ( రెడ్డి).. ఇక మిగిలిన ఆర్మూర్ నియోజక వర్గం నుంచి బీసీ అభ్యర్థిని పోటీలో దింపాలని ఆలోచన చేస్తున్నారు.

ఆర్మూర్ అభ్యర్థి ఎవరు..?

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితపై టీఆర్ ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 28 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  పోలింగ్ కు ముందే ఆకుల లలిత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహంలో చిక్కుకోవడం వల్ల చివరి క్షణంలో చేతులు ఎత్తేసిందనే టాక్ ఉంది. ఒకవేళ ఆకుల లలిత గెలుపు కోసం కృషి చేస్తే ఫలితం అనుకూలంగా వచ్చేదంటున్నారు. అయితే.. రాబోయే ఎన్నికలలో ఆర్మూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే బీసీ బిడ్డ ఎవరనేది చర్చానీయంశంగా మారింది. ఈరవత్రి అనిల్ (పద్మశాలి), మహేశ్ కుమార్ గౌడ్ ( గౌడ్), గోర్తా రాజేందర్ (మున్నూరు కాపు)ల పేర్లు వినిపిస్తున్నాయి. బీజీపీ – బీఆర్ ఎస్ రెడ్డి అభ్యర్థుల మధ్యన డబ్బున్న బీసీ బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

  • యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking